మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను తప్పిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. రెండురోజులగా ఇదే టాపిక్‌పై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా మహేష్ బాబుతో థమన్‌కు విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి రూమర్స్‌కు తాజాగా థమన్ షాకింగ్ ట్వీట్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది.
(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు)
'నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికి స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్' అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు. ట్రోల్స్ పై సెలబ్రీటీలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కారు. కాని తమన్ మాత్రం తనపై జరిగే ట్రోల్స్ కి సమాధానం చెప్పడంతో పాటు ఒక్కోసారి కౌంటర్స్ కూడా ఇదే రేంజ్‌లోనే ఇస్తాడు. దీంతో అసలు ఈ విషయం తెలియని వాళ్ళు ఏమైంది అన్నా.. అని అంటుండగా, కొందరు మాత్రం మహేష్ సినిమా మేకర్స్ అయినా స్పందిస్తే బాగుంటుంది కదా? అంటున్నారు.
And also From Tom I am starting #Buttermilk Stall for free of cost at my studios people suffering with stomach burning symptoms are welcome 🙏 pls get cured 👌🏼🤠
Good nite lots of work ahead don’t want to waste my time 🕰️ 🙏 and urs also #peace & #love
♥️🫶 and
some… pic.twitter.com/e2Fx7xkA6d— thaman S (@MusicThaman) June 19, 2023
(ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్)