Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

తెలుసు కదా మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
telusu-kada-movie-review.jpg

టైటిల్‌: తెలుసు కదా
నటీనటులు:సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష 
నిర్మాణ సంస్థ: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం: నీరజ కోన
సంగీతం: ఎస్‌. థమన్‌
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్‌ విఎస్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: అక్టోబర్‌ 17, 2025

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ అందుకున్న స్టార్‌ బాయ్‌ సిద్ధుకి ‘జాక్‌’ భారీ షాక్‌ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ (Telusu Kada Movie Review)లో చూద్దాం.


కథేంటంటే..
స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్‌ బ్రేకప్‌ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్‌ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్‌ రాగా ముందుకు వస్తుంది. 

కట్‌ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్‌ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్‌ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్‌. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్‌ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్‌.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్‌ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. పెళ్లి అయిన తర్వాత తల్లికాలేని భార్య.. ప్రియుడి బాధను అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు ముందుకు వచ్చిన ప్రియురాలు.. వీరిద్దరిని హీరో ఎలా డీల్‌ చేశాడనేదే సినిమా కథ. ప్రేమ, ఈగో, ఎమోషన్స్‌ చుట్టూ కథనం తిరుగుతుంది. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న పాయింట్‌ కాస్త కొత్తగా ఉన్నా.. కొన్ని చోట్ల​ హీందీ చిత్రం చోరి చోరి చుప్‌కే చుప్‌కే పోలికలు కనిపిస్తాయి. 

మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు కానీ..  ప్రియురాలే బిడ్డను కనేందుకు ముందుకు రావడం అనే లైన్‌ని సినిమా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలను కూడా కాస్త బోల్డ్‌గానే చూపించారు. ఈ విషయంలో దర్శకురాలిని అభినందించాల్సిందే. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. 

హీరో బ్రేకప్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్‌ చేయడం.. ఈ క్రమంలో అంజలిని కలవడం.. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండడంతో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టరనే విషయం తెలిసే వరకు కథనం సింపుల్‌గానే సాగుతుంది. రాగా ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. బిడ్డను మోసేందుకు తనే ముందుకు రావడంతో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.  ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం  వరుణ్‌, రాగా, అంజలిల చుట్టే తిరుగుతుంది.  వరుణ్‌, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే సెకండాఫ్‌ స్టోరీ. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురి మధ్య వచ్చే సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. అయితే సినిమాలోని డైలాగ్స్‌ అన్ని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. 



ఎవరెలా చేశారంటే..
ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్‌ పాత్రలో సిద్దు ఒదిగిపోయాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు సంతోషంగా గడిపి తర్వాత ఎవరిదారి వారు చూసుకుందామనే అమ్మాయి రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కగా నటించింది. వైవా హర్ష తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తమన్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఆ బీజీఎం మొత్తం ఇటీవల వచ్చిన ఓజీ సినిమాను గుర్తు చేస్తుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
2.75/5
Tags:
Siddu Jonnalagadda
Telusu Kada Movie
Raashi Khanna
Tollywood
Movie review
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.