నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. ఇటీవల సుధీర్ నటించిన సినిమా గాలోడు. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది నవంబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది?
ఇందులో మాస్ హీరోగా మెప్పించాడు సుధీర్. దీంతో సుధీర్ ఈ చిత్రంతో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. గాలోడు స్ట్రీమింగ్ రైట్స్ ఆహా వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. దీని ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి గాలోడు మూవీ ఆహాలో అందుబాటులోకి రానుంది. కాగా ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్గా నటించగా.. సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Dance irukku… Comedy irukku…
Action Irukku… Full on entertainment irukku… Sensational hit Galoodu Premieres Feb 17 only on aha😇#GalooduOnAHA #SudigaliSudheer @sudheeranand @gehna_sippy @SamskruthiFilms @PRDuddiSreenu pic.twitter.com/qvoi7INvtp— ahavideoin (@ahavideoIN) February 11, 2023