Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. ప్రపంచమంతా రామమయం
ADVERTISEMENT

ప్రపంచమంతా రామమయం

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 04:39 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Ramayana1.jpg

రామాయణ– పార్ట్‌ 1

ముందు మాట రామాయణం... భారతదేశ సంస్కృతికి నిలువుటద్దం. తరతరాలుగా విరాజిల్లుతున్న ఓ మహా ఇతిహాసం. ప్రతి భారతీయుడికి పరిచయమున్న కథ ఈ రామాయణం. రామాయణ కథను ఓ వాక్యంలో చెప్పవచ్చు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అదే కట్టె... కొట్టె... తెచ్చె. అలాగే అదే కథను ఎన్నో భాగాలతో సీరియల్‌గా కూడా చూశాం. అదే విధంగా ఈ మహాకావ్యం ఇప్పటికే వెండితెరపై ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఆ కోవలోనే ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత నమిత్‌ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ సినిమాకున్న ఘనత చెప్పుకోవాలి.

రూ. 4000 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో ఆరు భాషల్లో రెండు భాగాలుగా ఈ భారీ సినిమాను ప్లాన్‌ చేశారు. అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమలో హాలీవుడ్‌కు ఇప్పటిదాకా ఓ రికార్డు ఉండేది. ఆ రికార్డును కూడా మన ‘రామాయణ’ చిత్రం తుడిచిపెట్టేసింది. నాటి హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 స్క్రీన్ల పైనే ప్రదర్శితమైతే మన ‘రామాయణ’ చిత్రం దాదాపుగా 59,000 లకు పైగా స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. ప్రపంచంలో అతి పెద్ద పది బడ్జెట్‌ చిత్రాలలో ఇప్పుడు ‘రామాయణ’ కూడా నిలవడం విశేషం. అంత ఘనంగా విడుదలైన ‘రామాయణ’ ఎలా ఉందో ఆ రామాయణం పంథాలోనే (కట్టె... కొట్టె... తెచ్చె) చూద్దామా..

కట్టె (తెర వెనుక ఎలా నిర్మించారు)...
ప్రతి భారతీయుడికీ పరిచయమున్న కథ అయినా చెప్పే రీతిలో వైవిధ్యం లేక పోతే ప్రేక్షకులు ఆదరించరన్న సూత్రం నేటి తరం దర్శక–నిర్మాతలకు బాగా తెలుసు. నమిత్‌ మల్హోత్రా ఈ సినిమా ప్రకటించిన రెండు సంవత్సరాలలో పూర్తి చేసిన భారీ చిత్రం  ఇది. దర్శకుడు నితీష్‌ తివారి ఎంతో జాగ్రత్తగా ఓ శిల్పాన్ని చెక్కినట్టు ఎంతో కష్టంతో ప్రయత్నం చేసిన దృశ్యకావ్యం ఈ ‘రామాయణ’. ఎవరికైనా ఆలోచన ఉంటే సరి పోదు, ఆచరణకు కావాల్సినంత ఆదరణ, నమ్మకం, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఈ చిత్రదర్శక–నిర్మాతలకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇంతటి ఘన చరిత్రను ఘనమైన చిత్రంగా తీర్చిదిద్దగలిగారు.

నమిత్‌ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాన్ని తీయడం నిజంగా అభినందనీయం. నిజానికి భౌతికంగా రామాయణాన్ని చూసిన వారెవరూ లేరు. వాల్మీకి రాసిన కావ్యంతోనే ఆ ఇతిహాసం తరతరాలకు పరిచయం. ఆ ఇతిహాసాన్ని ఓ భారీ దృశ్య కావ్యంగా మలిచిన ప్రయత్నం అద్భుతం. 4000 కోట్ల రూ పాయల బడ్జెట్‌ సినిమాలోని దాదాపు ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.

 ఊహకందని గ్రాఫిక్స్‌తో తెరపై గ్రాండియర్‌గా మలిచిన ఈ సినిమా చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచి పోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ ముందు ఏ హాలీవుడ్‌ సినిమా పనికి రాదు. సినిమా నిడివి మూడు గంటల పదిహేను నిమిషాలైనా దాదాపు గంటకు పైగా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్‌ ప్రేక్షకుడిని అలరిస్తాయి. దేవతలు–రాక్షసుల యుద్ధంతో ప్రారంభించి, జఠాయువు మరణంతో తొలి భాగాన్ని ముగించారు. ఈ సినిమా కోసం యూనిట్‌ పరిశోధనలు చేసి చాలావరకు వాడుకలో తెలియని విషయాలు కూడా పొందుపరచడం విశేషం. అందుకే వారి కృషి ఘనంగా తెర మీద ఆవిష్కృతమైంది.

కొట్టె (తెరపై ఎలా చేశారు)...
రామాయణ సినిమాలో ప్రధాన  పాత్రధారులందరూ తమ  పాత్రలలో జీవించారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ  పాత్రలంటే రావణుడి  పాత్రలో నటించిన ప్రముఖ కన్నడ నటుడు యశ్‌తో మొదలుపెట్టాలి. ఈ  పాత్రతోనే సినిమా ప్రారంభమౌతుంది. మనం విన్న, చూసిన రావణుడి పరాక్రమం, రౌద్రం నూటికి నూరు పాళ్ళు ఇలానే ఉంటాయన్న విషయం యశ్‌ తన నటనతో చూపించారు. బహుశా మున్ముందు ఇంకెవరైనా ఈ రావణుడి  పాత్ర చేసినా యశ్‌ని మించి పోయేలా చేయాల్సిందే. అంతలా జీవించారు యశ్‌. తెలుగు ప్రేక్షకులకు శ్రీరాముడిగా సుపరిచితుడు నాటి నందమూరి తారక రామారావు. 

ఆ  పాత్రను అప్పట్లో ఎంతో  సహజంగా చేశారాయన. ఆ స్థానం కోసం  పోటీ పడుతున్నట్టుగా ఈ సినిమాలో శ్రీరాముడిగా అలరించారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌. శ్రీరాముడి  పాత్రకు అతను తీసుకున్న శ్రద్ధ, చేసిన కృషి స్పష్టంగా ప్రతి ఫ్రేములో కనిపిస్తాయి. ఇక సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే ఫరవాలేదనిపించారు. ఆ పై దశరథుడి  పాత్ర చేసిన అరుణ్‌ గోవిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

నాటి దూరదర్శన్‌లో ప్రముఖంగా ప్రసారమైన ‘రామాయణ్‌’ సుపరిచతమే. అందులో రాముడిగా అలరించిన అరుణ్‌ గోవిల్‌ ఈ సినిమాలో రాముని తండ్రి దశరథునిగా చేయడం విశేషం. శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ తమ  పాత్రలకు న్యాయం చేశారు. అంతేకాదు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ తన మ్యూజిక్‌తో ఈ దృశ్య కావ్యాన్ని శ్రవణానందం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం విజువల్‌ ఎఫెక్ట్స్‌. ప్రతి ఫ్రేములో వారి కష్టం కనిపిస్తుంది. ఇంతటి భారీ తారాగణానికి భారీ సాంకేతిక బృందం కూడా తోడై ప్రేక్షకుల హృదయాలను దోచేశారనే చెప్పాలి.

తెచ్చె (ప్రేక్షకులను ఎలా మెప్పించారు)...
దేవతలు, రాక్షసుల యుద్ధంతో ప్రారంభమైన ఈ కథ రావణుడి ఆగమనంతో వేగం పెరుగుతుంది. ఆ పై రావణుడు లంకా నగరాన్ని దేవతల నుండి లాక్కొని తనదైన శైలిలో పరి పాలన ప్రారంభిస్తాడు. మరోపక్క శ్రీరామ జననం అయోధ్యలో జరుగుతుంది. ఆ పై సీతారాముల వివాహం, వనవాసం, రావణునిచే సీతాపహరణ చివరగా జఠాయువు మరణంతో మొదటి భాగం ముగుస్తుంది. తెలిసిన కథైనా చెప్పే రీతి విభిన్నంగా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించేలా ఉందీ చిత్రం.

ముఖ్యంగా సినిమా ప్రారంభంలో రావణుడు దేవతలపై చేసే యుద్ధం, కుంభకర్ణుడిని నిద్ర లేపే సన్నివేశాలు, సీతను ఎత్తుకెళ్ళే రావణుడి వాహనం ఇలా చెప్పుకుంటూ  పోతే ఎన్నో ఎన్నెన్నో... ఆ గ్రాఫిక్స్‌ అన్నీ న  భూతో న భవిష్యతి. ప్రపంచ సినీ పరిశ్రమలో విజువల్‌ వండర్స్‌కి పెట్టింది పేరు హాలీవుడ్‌. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రపంచ సినిమాలో మన భారతీయ సినిమా ‘రామాయణ’ మించిన గ్రాఫిక్స్‌ సినిమా ఇంతవరకూ రాలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు. అంతేకాదు... ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఈ సినిమా డబ్బింగ్‌ ప్రక్రియ. ఆధునిక టెక్నాలజీతో భాషేదైనా సరే  పాత్రధారుల పెదవుల కదలికలు స్పష్టంగా మాట్లాడే భాషలో ప్రతిబింబించడం ఓ అద్భుతం. ఆద్యంతం కనిపించే అద్వితీయమైన సన్నివేశాలు ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూసేలా ప్రేరేపిస్తాయనడంలో సందేహమే లేదు.

జెన్‌జీలకు...
రామాయణం అనేది మన జీవితంలో ఓ భాగం. భారతదేశంలో తరతరాలుగా వ్యాపిస్తున్న ఇతిహాసం. ముఖ్యంగా రేపటి తరానికి అంటే జెన్‌ జీ, ఆల్ఫా తరాలకు ఈ చిత్రాన్ని వారి పరిభాషలో చూపించే బృహత్తర ప్రయత్నం చేశారు దర్శక–నిర్మాతలు.  

రామాయణంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను: – ఎస్‌.ఎస్‌. రాజమౌళి
‘రామాయణ’ సినిమాపై ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి  ప్రశంసలు కురిపించారు. ‘‘రామాయణం’ సినిమా విజువల్స్‌ బిగ్‌ స్క్రీన్ పై అద్భుతంగా ఉన్నాయి. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ చక్కగా నటించారు. ముఖ్యంగా వనవాసం సన్నివేశాల నుంచి ఎంతో అద్భుతమైన ఔన్నత్యంతో కనిపించారు. రావణుడిగా యశ్‌ ప్రెజెన్ ్స అద్భుతంగా ఉంది. సీతగా సాయి పల్లవి హుందాగా కనిపించారు. 
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ నాకు ఎంతగానో నచ్చాయి. సినిమాలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విజన్ ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన నమిత్‌ మల్హోత్రా, నితీష్‌ తివారీతో  పాటు యూనిట్‌కి అభినందనలు’’ అంటూ సోషల్‌ మీడియాలో రాజమౌళి  పోస్ట్‌ చేశారు.

– హరికృష్ణ ఇంటూరు 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
SS Rajamouli
ranbir kapoor
Yash
ramayana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రామాయణ మూవీ.. ఆ ఫార్మాట్‌లో కాసుల వర్షం

రామాయణ మూవీ.. ఆ ఫార్మాట్‌లో కాసుల వర్షం

రామాయణ పైరసీ.. వాటిని తొలగించాలని వార్నింగ్..!

రామాయణ పైరసీ.. వాటిని తొలగించాలని వార్నింగ్..!

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ

రామాయణంపై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న కామెంట్స్... ఏమన్నాడంటే...!

రామాయణంపై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న కామెంట్స్... ఏమన్నాడంటే...!

మేకప్‌ కోసమే 4 గంటలు.. ‘శూర్పణఖ’కోసం రకుల్‌ ఎంత కష్టపడింతో తెలుసా?

మేకప్‌ కోసమే 4 గంటలు.. ‘శూర్పణఖ’కోసం రకుల్‌ ఎంత కష్టపడింతో తెలుసా?

'వారణాసి' సినిమాలో భారీ మార్పులు ఇవే..!

'వారణాసి' సినిమాలో భారీ మార్పులు ఇవే..!

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

చివరి నిమిషంలో షాకిచ్చిన 'భోగి'

చివరి నిమిషంలో షాకిచ్చిన 'భోగి'

ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది

ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది

ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్

బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్

అమితాబ్.. ఈసారి భయపడలేదు

అమితాబ్.. ఈసారి భయపడలేదు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft