Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

సుమన్‌ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?

Movies Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sr-director-sagar-reveal-about-actor-suman-arrest.jpg

ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో తనకు టాలెంట్‌ ఉండటంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. సుమ‌న్ డేట్స్ కోసం ఆ రోజుల్లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూక‌ట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో కూడా సుమ‌న్‌ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను సుమన్‌ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు.

(ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?)

ఆ కారణం వల్ల ఒక్కసారిగా ఆయన ఇమేజ్‌ దెబ్బతిన్నది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీని వెనుక చాలా మంది హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు కలిసి పక్కా ప్లాన్‌తో ఆయన్ను ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి అవి ఇ‍ప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి పేరును కూడా పలువురు ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని సుమన్‌ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు.

అసలు విషయం ఏంటనేది ఇప్పటికీ ఆయన చెప్పలేదు. కానీ సుమన్‌ జైలుకు సంబంధించిన టాపిక్‌పై దివంగత సీనియర్‌ దర్శకులు సాగర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగ వైరల్‌ అవుతున్నాయి. అప్పట్లో అమ్మదొంగా ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్‌, యాక్షన్‌ నెంబర్‌ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలా ఆయన అందరికి సుపరిచయమే.

ఈ కారణంతోనే జైలుకు వెళ్లాడు

నీలి చిత్రాల విషయంలో సుమన్‌ జైలుకు వెళ్లలేదని ఆ వీడియోలో డైరెక్టర్‌ సాగర్‌ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, అప్పట్లో తమిళనాడులో  పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్‌ కాంట్రాక్టర్‌ (వడియార్‌) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్‌ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్‌ కాంట్రాక్టర్‌ చాలా పవర్‌ ఫుల్‌ అలాంటి వ్యక్తి కూతురిని  సుమన్‌ ఫ్రెండ్‌ ఒకరు ప్రేమించాడు.

మరోవైపు హీరో సుమన్‌ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. అతని సినిమా షూటింగ్‌ ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సుమన్‌ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడే వాడు కాదని తెలిపాడు. ఒకరకంగా వన్‌సైడ్‌ లవ్‌ అని చెప్పాడు. కానీ డీజీపీ మాత్రం తన కూతురికి ఇప్పటికే పెళ్లి అయిందని, ఆమె సుమన్ ట్రాప్‌లో పడిందనే ఆలోచనతో ఎంజీఆర్‌కు తెలపడం. మరోవైపు సుమన్‌ ఫ్రెండ్‌ కూడా లిక్కర్‌ కాంట్రాక్టర్‌ కూతురితో ప్రేమ వ్యవహారం. ఈ రెండు విషయాలు సుమన్‌ను ఇబ్బంది పెట్టాయని సాగర్‌ తెలిపారు.

సుమన్‌ అరెస్ట్‌ అవుతాడని ఆ నిర్మాతకు ముందే తెలుసు 

సుమన్‌ విషయంపై డైరెక్టర్‌ సాగర్‌ ఇలా చెప్పారు.. 'ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్‌ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్‌ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్‌ రాకుండా ఉండే పలు సెక్షన్స్‌ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే.

(ఇదీ చదవండి: తమన్నా కోసం ఆ టాప్‌ హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన అజిత్‌)

సుమన్‌ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్‌ ఉండేది. అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్‌ అరెస్ట్‌ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసు​కున్నారు.

జైలు నుంచి ఎలా రిలీజ్‌ అయ్యాడంటే

సుమన్‌ అమ్మగారికి అప్పటి గవర్నర్‌ PC అలెగ్జాండర్ క్లాస్‌మేట్‌ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్‌ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్‌ గడిపాడని ఆయన తెలిపాడు. జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్‌ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్‌ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు.

అప్పట్లో సుమన్‌ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్‌ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్‌ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ సాగర్‌ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Suman
Police
case
MGR
Tamilanadu CM
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.