కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కమల్ కుమార్తె నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) పాల్గొన్నారు. వేదికపై ఒక పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. థగ్ లైఫ్ నుంచి 'విన్వెళి నాయగ' (Vinveli Nayaga) అనే తమిళ వర్షన్ పాటను వేదికపై ఆమె ఆలపించారు. సినిమాలో కూడా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్‌తో కలిసి ఆమె ఆలపించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT