సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది.
ఆత్మీయంగా కలిసి మరీ..
తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మెగాస్టార్‌ను అభినందించాడు. ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను.

మెగాస్టార్‌తో శివన్న లంచ్
మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్ కుమార్‌తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗
Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso— Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024
చదవండి: హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు!