'షారుక్‌ను ఆపొచ్చేమో కానీ పఠాన్‌ను ఎలా ఆపగలరు?' గతేడాది మార్చిలో కండలు తిరిగిన ఫోటో షేర్ చేస్తూ దానికి ఈ క్యాప్షన్ జోడించాడు షారుక్ ఖాన్. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. బాక్సాఫీస్ దగ్గర పఠాన్‌ను ఆపడం ఎవ్వరి తరం కానట్లే కనిపిస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్‌కు కొత్త కళను తీసుకొచ్చింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది.
కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.429 కోట్లు రాబట్టింది. ఇందులో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు రాగా ఓవర్సీస్లో రూ.164 కోట్లు వసూలు చేసింది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా పఠాన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు.
‘PATHAAN’: ₹ 429 CR WORLDWIDE *GROSS* IN 4 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *4 days*…
⭐️ #India: ₹ 265 cr
⭐️ #Overseas: ₹ 164 cr
⭐️ Worldwide Total *GROSS*: ₹ 429 cr
🔥🔥🔥 pic.twitter.com/Qd8xriCFvX— taran adarsh (@taran_adarsh) January 29, 2023
‘PATHAAN’ NEW MILESTONE: FASTEST
TO HIT ₹ 250 CR… AGAIN OVERTAKES ‘KGF2’, ‘BAAHUBALI 2’, ‘DANGAL’…
⭐️ #Pathaan: Will cross ₹ 250 cr today [Day 5]
⭐️ #KGF2 #Hindi: Day 7
⭐️ #Baahubali2 #Hindi: Day 8
⭐️ #Dangal: Day 10
⭐️ #Sanju: Day 10
⭐️ #TigerZindaHai: Day 10#India biz. pic.twitter.com/DFsXcptErD— taran adarsh (@taran_adarsh) January 29, 2023
చదవండి: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి
సుశాంత్ చనిపోయేముందు మెసేజ్ వచ్చింది, కానీ నేనే పట్టించుకోలే