ఒక వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది సమంత. ప్రస్తుతం సామ్ బాలీవుడ్లో ‘సీటడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతోంది. తాజాగా సిటడెల్ టీమ్ అంతా భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ముని కలిశారు. రాష్ట్రపతి ముర్ము ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీటాడెల్ టీమ్ రెండు రోజుల క్రితం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
(చదవండి: ప్రేమ అప్పుడే పుట్టింది.. శాశ్వతంగా ఉండిపోతుంది: లావణ్య త్రిపాఠి )
ఈ ఫోటోలను హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘రాష్ట్రపతిని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’అని తెలిపాడు. ఇక సీటాడెల్ దర్శకులు రాజ్ అండ్ డీకే దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ముగారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమెకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. మా సీటడెల్ యాక్షన్ సిరీస్ అయినా చూసేందుకు ప్రయత్నిస్తా అని ఆమె చెప్పడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
What a privilege to meet the gently humorous and humble Smt Droupadi Murmu, Honourable President of India! @rashtrapatibhvn
She likes comedies but said she would give our actioner a try! 😊 pic.twitter.com/t88hhUpcZg— Raj & DK (@rajndk) June 8, 2023