మెగాఇంట్లో సెలబ్రేషన్స్ సందడి మొదలైపోయింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జూన్ 20న అంటే ఈ రోజు ఉదయం పాప పుట్టింది. దీంతో సెలబ్రిటీల దగ్గర నుంచి అభిమానులకు వరకు ప్రతిఒక్కరూ చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో మెగా ప్రిన్సెస్ విషయంలో ఓ సెంటిమెంట్ వర్కౌటైందా అని కూడా మాట్లాడుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో మూవీ 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 2012లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట రీసెంట్ గా 11వ పెళ్లి వార్షికోత్సవం జరుపుకొంది. ఇప్పుడు జూన్ 20వ తేదీన పండంటి పాపాయికి ఉపాసన జన్మనిచ్చింది.
మరోవైపు చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబరు 2. పైన చెప్పిన వాటిలో ఏది చూసినా సరే దాదాపు అన్నింట్లోనూ '2' నంబర్ కనిపిస్తుంది. దీంతో అభిమానులు కూడా.. చరణ్-ఉపాసన దంపతులకు ఈ నంబర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కనబెడితే '2023' చరణ్ కి స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ ఈ ఏడాదే వచ్చింది కదా!
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
(ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్)