హైదరాబాద్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్లో వీరంగం సృష్టించారు. సుదర్శన్ థియేటర్లో యోగి రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్‌లోని స్క్రీన్‌తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
(ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!)
థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
(ఇది చదవండి: జిలేబి సినిమా రివ్యూ)
Frustrated Prabhas fans are damaging theatre property because #Rogi4K failed to cross even the parking collections of previous re-releases.
The cost of theatre damage is greater than the overall collections collected by ROGI till now."pic.twitter.com/eNO1XiYiw3— HNE Official™ (@urstrulyHNE) August 18, 2023