‘యానిమల్’తర్వాత సందీప్‌రెడ్డి వంగా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్లుగానే సందీప్ రెడ్డి వంగా అనౌన్స్మెంట్స్ ఉంటున్నాయి.
తొలుత ఈ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణెను అనుకున్నాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఆమె పెట్టిన కండీషన్స్ నచ్చక..దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు. షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఇప్పటికే 40 శాతం పూర్తయింది కూడా. ఈ విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్లో స్వయంగా సందీప్ రెడ్డినే చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ డార్క్ యాక్షన్ ఎంటర్నర్లో మరో బాలీవుడ్ భామ కూడా నటించబోతుందట. ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్‌ని రంగంలోకి దించేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆమెను సంప్రదించి.. కథ వినిపించాడట. పాత్ర నచ్చడంతో కత్రినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆమె పాత్రకు కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుదంట. అలా అని క్యామియో రోల్ కాదు. కథను మొత్తం పూర్తిగా మార్చేసే పాత్ర అట. అందుకే నిడివి తక్కువైనా కత్రినా ఓకే చెప్పిందట.
మొత్తానికి సందీప్ అయితే పెద్ద ప్లానే వేశాడు. చిన్న చిన్న పాత్రల కోసం కూడా స్టార్స్‌ని పెడుతున్నాడు. ఐశ్వర్య దేశాయ్ కూడా ఓ పాత్ర చేస్తుంది. విలన్ గా వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది.