Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Movies_Latest.jpg

తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్‌మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.

‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్‌కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.

ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్‌ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్‌మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.


అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్‌గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.

ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్‌ల పాత్రల రిప్రజెంటేషన్‌పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్‌లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్‌లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.


సీనియర్‌, జూనియర్‌ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే  వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్‌ఫార్మర్‌ అయిన ప్రీతి ముకుందన్‌ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్‌ సెన్సేషన్‌ బ్లా‍స్ట్‌లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు సెటైర్‌ పడింది. ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్‌ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.


బాలీవుడ్‌లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.

మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్‌కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్‌లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Heroines
characters
Movie News
Janhvi Kapoor
Peddi Movie
Social Media
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.