Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

మగాళ్లకి వర్జిన్ భార్యలే కావాలి : నటి సంచలన కామెంట్స్

Movies Sakshi User Sakshi Sakshi Time Feb 18, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Neena-Gupta-Says-India.jpg

ఛోళీకే పీఛే క్యాహై అనే ఖల్‌నాయక్‌లో పాట గుర్తున్నవాళ్లకి మాధురీ దీక్షిత్, సంజయ్‌ దత్‌లతో సమానంగా గుర్తుండే మహిళ నీనాగుప్తా. సినిమాల్లో నటనకు మాత్రమే కాదు అత్యంత స్వేఛ్చాయుత వ్యక్తిగత జీవితం ద్వారా బాలీవుడ్‌  టాప్‌ స్టార్స్‌ కన్నా మిన్నగా ఆమె గుర్తొస్తారు. మహిళల వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రంపై ఆమె  తరచుగా వెల్లడించే అభిప్రాయాల సందర్భంలో నీనా వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆమె 30 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండానే ఒంటరి తల్లి అయ్యింది.  ఆమె కుమార్తె మసాబా రాకను సంతోషంగా  స్వాగతించింది. వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌ తన బిడ్డకు తండ్రి అని ఆ తర్వాత వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే స్వేఛ్చగా తన జీవితం గడుపుతూ వస్తోంది. అయితే తన నిర్ణయాలతో తనకు బాగుండవచ్చునని, అందరినీ అదే దారి ఎంచుకోవాలనే సలహా తాను ఇవ్వబోనని తరచుగా ఆమె స్పష్టం చేస్తుంటారు. 

ఈ నేపధ్యంలో...మన దేశంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షాపూరిత వాస్తవాల గురించి ప్రముఖ నటి నీనా గుప్తా మరోసారి కుండ బద్ధలు కొట్టారు. ఆధునిక సమాజపు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందనీ, విశాల థృక్పధం గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఆమె నిర్ధ్వందంగా తిప్పికొట్టారు. ఇటీవల ఓ మీడియాతో  జరిపిన సంభాషణలో, ఈ సీనియర్‌ నటి పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇప్పటికీ వివాహం తర్వాత మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె ఎత్తి చూపారు.  

ఈ సంభాషణ సందర్భంగా భారతీయ సంప్రదాయ సమాజంలో వధువు కన్యత్వం పట్ల ఇంకా కొనసాగుతున్న వ్యామోహాన్ని నీనా ప్రస్తావించారు. నేటికీ కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా అని అడిగినప్పుడు, భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించారు.   ‘మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు‘ అని ఆమె అన్నారు. 

కొంత వరకూ నగరాల్లో, ఇంగ్లీష్‌ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని అయితే అది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ’వారు కూడా కన్యనే  భార్యగా కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారామె.

పరిస్థితులు మారిపోయాయనే ఊహను నీనా ప్రశ్నించింది. ‘మన దగ్గర జనం ఓపెన్‌గా ఉంటారని ఎలా అంటున్నారు? అదొక్కటే కాదు మన దేశంలో చాలా విషయాలు ఇప్పటికీ మారలేదు. మహిళలు ఇప్పటికీ తలపై కొంగు కప్పుకుని ఆ తర్వాత మామగారి పాదాలను తాకుతారు. ఇక్కడ నువ్వూ నేనూ మైనారిటీలం, మనం నిజమైన భారతదేశం కాదు.  చక్కగా దుస్తులు ధరించి, చక్కగా మాట్లాడే మనలాంటి వారు భారతదేశం కాదు.‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారామె. తన అభిప్రాయాన్ని బలపరిచేలా నీనా తన సొంత కుటుంబంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.

‘నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా తండ్రి వైపు ఉన్న ఒక బంధువుల అమ్మాయి ముంబైలో ఒక పెద్ద  సంస్థలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒకసారి నా తండ్రి ఆ అబ్బాయి, అమ్మాయి  ఆమె కుటుంబాన్ని తన ఇంటికి  మాట్లాడటానికి పిలిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముంబైలో ఆ అబ్బాయి, అతని కుటుంబంతో ఇకపై నివసించడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి అలాంటి వివక్ష ఎదుర్కుంది మరి. కనీసం తనకు నచ్చిన దేవుడ్ని పూజించడానికి కూడా ఆ అమ్మాయిని అనుమతించలేదట. ఆ అమ్మాయి సాయి బాబా  అంటే ఇష్టం కాబట్టి బాబా ఫొటోను తన గదిలో ఉంచితే ఆమె అత్తగారు దానికి కూడా అనుమతించలేదు. తాము  పూజించే ఓ గురువు ఫొటోనే పెట్టాలని ఆదేశించింది‘ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

తర్వాత ఆమె మరొక సంఘటనను ఉదహరించారు. ‘నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ఇది నా మేనకోడలికి సంబందించింది. ఆమెను ఆమె అత్తగారు తన కుటుంబ ఫోటోను తన పడక టేబుల్‌పై పెట్టుకోవద్దని అడ్డుకున్నారు’’ అంటూ పంచుకున్నారామె. ఏదేమైనా దేశంలోని మహిళల స్థితిని మార్చే విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Neena Gupta
Bollywood Actress
virgin
Movie News
Satya Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.