Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘నవాబ్‌ కేఫ్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nawabcafe.jpg

టైటిల్‌: నవాబ్‌ కేఫ్‌
నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్‌ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: హర్షిక ప్రొడక్షన్స్‌
దర్శకుడు : ప్రమోద్‌ హర్ష
నిర్మాత: రాధా వి పపుడిప్పు
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి
విడుదల తేది: ఫిబ్రవరి 20, 2026

టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్‌ అయిన మరో చిన్న సినిమా ‘నవాబ్‌ కేఫ్‌’. మొదటి ఈ సినిమాకు చాయ్‌ వాలా అని టైటిల్‌ పెట్టారు. కానీ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేశాయి. పాతబస్తీ ఇరానీ చాయ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని రన్‌ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీలవుతాడు. తాత, తండ్రి లాగే రంగనాథ్‌ ‘టీ’కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్‌లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్లి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. 

పెదనాన్న కొడుకు కుమార్‌(చైతన్య కృష్ణ) సలహాతో కేఫ్‌ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదేరోజు రాత్రి రంగనాథ్‌ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? తన కలలను నెరవేర్చుకోవడం కోసం ‘నవాబ్ కేఫ్’ అమ్మేశాడా? లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్‌ని రన్‌ చేశాడా? ‘నవాబ్ కేఫ్’ కోసం కుమార్‌ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖీ( తేజు అశ్విని) ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం.. ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి..తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం.. ఆ బిజినెస్‌ని దెబ్బతీసేందుకు విలన్‌ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి.. చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం..ఈ లైన్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘నవాబ్ కేఫ్’ కూడా ఇలాంటి కథే. కథ-కథనం రెండూ.. ఇటీవల ధనుష్‌ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం.. ఇక్కడ టీ కొట్టు.. అంతే తేడా. తండ్రి-కొడుకు ఎమోషన్‌ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్‌ హర్ష ఎంచుకున్న పాయింటే రొటీన్‌ అంటే.. స్క్రీన్‌ప్లే కూడా అలానే ఉంది.  కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్‌ సీన్‌ ఒక్కటి కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మిగతా కథంతా ఊహకందేలా.. నిదానంగా సా..గుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. 

నవాబ్‌ కేఫ్‌ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు.  ఆ తర్వాత హీరో ఎంట్రీ.. హీరోయిన్‌తో పరిచయం.. వారిద్దరి మధ్య సాగే లవ్‌ట్రాక్‌.. ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు.  సినిమాలో హీరోయిన్‌ ఉండాలి కాబట్టి.. సఖీ పాత్రను క్రియేట్‌ చేశారు కానీ..కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు.  హీరో అమెరికాకు వెళ్లాలని ఫిక్స్‌ అయినప్పుడే..తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఎమోషనల్‌ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం కథనం మరింత సాగదీతగా సాగుతూ..  ఇడ్లీ కొట్టు,  కీర్తి సురేశ్‌ మిస్‌ ఇండియా తో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుంది.  ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్‌ కనకాల రొటీన్‌ పాత్రే చేసినా.. ఎమోషనల్‌ సీన్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  హీరోయిన్‌ తెజు అశ్విని పాత్రకు కథలో ప్రాధాన్యత లేదు.  తెరపై కనిపించేది కూడా తక్కువే.  రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తనదైన కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

 సాంకేతికంగా కూడా సినిమా యావరేజ్‌గానే ఉంది. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్‌ పాయింట్‌ ఉందంటే..అది ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అని చెప్పాలి. ఆయన అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమా మొత్తంలో చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లను కట్‌ చేసినా.. కథకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
1.5/5
Tags:
Shiva Kandukuri
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'చాయ్‌ వాలా' టైటిల్‌ వద్దని చెప్పారు

'చాయ్‌ వాలా' టైటిల్‌ వద్దని చెప్పారు

ఒక్కొక్కరం ఒక్కో రంగు

ఒక్కొక్కరం ఒక్కో రంగు

ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్‌ సిరీస్‌

ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్‌ సిరీస్‌

ఓటీటీలో డిటెక్టివ్ థ్రిల్లింగ్‌ సినిమా స్ట్రీమింగ్‌

ఓటీటీలో డిటెక్టివ్ థ్రిల్లింగ్‌ సినిమా స్ట్రీమింగ్‌

మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి

మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.