దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! యాత్ర 2 లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.
పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇన్టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్టర్లో గమనించవచ్చు. పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 - 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు.
‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
In the shadow of a legend, A leader rises!
Presenting the first look of #Yatra2. In cinemas from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @vcelluloidsoff @KetakiNarayan @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/doygY3BBTC— Mahi Vraghav (@MahiVraghav) October 9, 2023
చదవండి: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్ ప్రక్రియ.. అమర్, తేజలకు..