Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

14 సినిమాల్లో 10 బ్లాక్‌ బస్టర్స్‌.. 49 ఏళ్లకే మృతి.. ఎవరీ సూపర్‌ స్టార్‌?

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kantha2.jpg

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు స్టార్‌ అవుతారు..ఎవరు జీరో అవుతారో ఊహించలేం.డబ్బు, ఫేమ్‌ ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ అంచనా వేయలేం. స్టార్‌ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఆ స్టార్‌డమ్‌ని కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ఒక చిన్నతప్పు చాలు ‘స్టార్‌’ని కాస్త జీరో చేయడానికి. ఉన్న ఫేమ్‌ పోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. రాలేదు కూడా. అలా ఓ వ్యక్తి తక్కువ రోజుల్లోనే స్టార్‌ హీరోగా గుర్తింపు పొంది.. ఈగోతో గొడవలకు పోయి ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకోవడమే కాదు.. హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.అంతేకాదు 49 ఏళ్లకే తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసుకున్నాడు. ఆయనే  ఎంకే త్యాగరాజ భాగవతార్ అలియాస్‌  ఎంకేటీ.

14 సినిమాల్లో 10 బ్లాక్‌ బస్టర్స్‌
ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి.ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. ఎంకే త్యాగరాజ భాగవతార్  పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అభిమానులు ముద్దుగా ఎంకేటీ అని పిలుస్తారు. 1910లో పుట్టిన త్యాగరాజన్‌ది పేద కుటుంబం. కర్ణాటక సంగీత గాయకుడుగా పేరు సంపాదించింది తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.1934-59 మధ్యకాలంలో 14 సినిమాల్లో హీరోగా నటిస్తే.. అందులో 10 భారీ విజయం సాధించాయి. దీంతో ఆయనకు సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్‌లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట.

హత్యకేసులో జైలుకు..
స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఎంకేటీ ప్రవర్తలో మార్పు వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తలకిందులు చేసిందట. ఈగోతో ఆ దర్శకుడితో గొడవపడడంతో తర్వాత అవకాశాలు తగ్గిపోయాయట. ఆ సమయంలోనే  జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఆయన అవకాశాల కోసం చాలా ప్రయత్నాలే చేశాడట. చివరకు అనారోగ్య భారిన పడి 1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.

‘కాంత’ ఈ హీరో కథేనా?
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంతా’. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూస్తే..ఇది ఎంకేటీ బయోపిక్‌లాగే అనిపిస్తుంది. ఇందులో ఎంకేటీ పాత్రలో దుల్కర్‌ నటించగా.. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు.  కానీ చిత్ర యూనిట్‌ మాత్రం  ఇది ఎంకేటీ బయోపిక్‌ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kaantha Movie
Dulquar Salman
Tamil actor
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్‌?

రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్‌?

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!

ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.