Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

సినిమా ఒకటి... క్లైమాక్స్‌లు రెండు

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Housefull-5.jpg

హిందీలో ‘హౌస్‌ఫుల్‌ 5’ చిత్రబృందం వినూత్న  ప్రయోగం 

వసూళ్లకు ఇదో కొత్త మార్గం

ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్‌లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్‌ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్‌లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్‌ ఆడియన్స్‌ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్‌ హీరోల సినిమాలకు సైతం రిపీట్‌ ఆడియన్స్‌ ఉండటం లేదు. 

ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా స్ట్రీమింగ్‌ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్‌లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్‌లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’ యూనిట్‌ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 

5ఏ అండ్‌ 5బీ 
హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీస్‌లో ‘హౌస్‌ఫుల్‌’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్‌ఫుల్‌ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, అభిషేక్‌ బచ్చన్, సంజయ్‌ దత్, ఫర్దీన్‌ ఖాన్, శ్రేయాస్‌ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌... ఇలా ప్రముఖ తారలు ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాలో నటించారు. తరుణ్‌ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్‌ఫుల్‌ 5ఏ, హౌస్‌ఫుల్‌ 5బీ’ అంటూ రిలీజ్‌ చేస్తున్నారు. కానీ... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు.

 ఒకే సినిమాకు రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లు ఉంటాయన్నమాట. అంటే... ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్‌ ఉంటే, ‘హౌస్‌ఫుల్‌ 5బీ’లో మరో డిఫరెంట్‌ క్లైమాక్స్‌ ఉంటుంది. అలాగే  ‘హౌస్‌ఫుల్‌ 5ఏ, హౌస్‌ఫుల్‌ 5బీ’... ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు.

 ‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్‌ఫుల్‌ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లతో రాబోతోంది. మరి... మీరు ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్‌ఫుల్‌ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్‌ చేశారు అక్షయ్‌ అండ్‌ రితేష్‌. ఇదిలా ఉంటే... ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్‌ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’లో కిల్లర్‌ ఒకరైతే, ‘హౌస్‌ఫుల్‌ 5బీ’లో కిల్లర్‌ మరొకరు ఉంటారట.  

తొలి ఇండియన్‌ సినిమా! 
కొన్ని సినిమాలు స్టార్టింగ్‌ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్‌లో మాత్రం ఆడియన్స్‌ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్‌ఫుల్‌ 5’ టీమ్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్‌ ‘హౌస్‌ఫుల్‌ 5బీ’ సినిమా క్లైమాక్స్‌ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లొచ్చు. 

అలాగే ‘5బీ’ చూసినవాళ్లు 
‘5ఏ’ క్లైమాక్స్‌ ఇంకా బాగుందని వింటే... ఆ వెర్షన్‌ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్‌టాక్‌గా మారి, ప్రమోషన్‌కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్‌కు వచ్చే ఆడియన్స్‌ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్‌ ఆడియన్స్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయితే... హౌస్‌ఫుల్‌ టీమ్‌ వ్యూహం సక్సెస్‌ అయినట్లే లెక్క. మరి... ఈ ‘హౌస్‌ఫుల్‌ 5’ టీమ్‌ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’ అంటూ బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
HouseFull
Akshay Kumar
Riteish Deshmukh
Abhishek Bachchan
Different
climax
Bollywood
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్

శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్

రియా కపూర్‌ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం

రియా కపూర్‌ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.