మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గుర్తింపు పొందాడు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకోవడంతో చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో తాను సాధించలేనిది తన కొడుకు అతి తక్కువ సమయంలోనే సాధించాడంటూ ఆస్కార్ సమయంలో చిరు మురిసిపోయిన సంగతి తెలిసిందే.
నేడు తనయుడు పుట్టిన రోజు సందర్భంగా మారోసారి చరణ్‌పై ప్రేమ కురిపించారు చిరు. సోమవారం(మార్చి 27న) రామ్ చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే చిరంజీవి కూడా చరణ్‌కు స్పెషల్ విషెస్ తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ తనయుడు ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేశారు.
ప్రస్తుతం చిరు ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మెగా వారసుడిగా చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. మొదటి సినిమాతోనే అభిమానులను మెప్పించాడు. చేసింది 15 సినిమాలే అయినా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక మగధీర, రంగస్థలం వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023