Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!

Movies Sakshi User Sakshi Sakshi Time Sep 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mask-man-harish-tanuja-bigg.jpg

వీకెండ్ అయిపోయిందంటే బిగ్‌బాస్ హౌసులో నామినేషన్స్ గోల మొదలవుతుంది. ఈసారి కూడా షురూ అయిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ తను చెప్పిందే రైట్ అన్నట్లు అందరినీ టార్చర్ పెడుతున్నాడు! ఇన్నిరోజులు ఓపిక పట్టిన తనూజ.. నామినేషన్స్‌లో ఇతడిని ఉతికారేసింది. సైలెంట్‌గా నవ్వుతూ కనిపించిన రీతూ కూడా రెచ్చిపోయింది. ఇంతకీ సోమవారం ఏం జరిగింది?

(ఇదీ చదవండి: అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)

ఆదివారం నాగార్జున వచ్చి వెళ్లిపోయిన తర్వాత హౌస్‌మేట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంటి పని విషయంలో కామనర్స్ శ్రీజ-మనీష్ మధ్య మాటమాట పెరిగింది. దీంతో మూలకెళ్లి కూర్చుకున్న మనీష్.. వరస్ట్ కామనర్స్ వీళ్లు, ఓ గలీజ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అంటూ తనతో వచ్చిన వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరోవైపు వీకెండ్ నాగార్జున గట్టిగా వాయించేసరికి మాస్క్ మ్యాన్ డీలా పడిపోయాడు. ఏం చేయాలో తెలీక తినడం మానేశాడు.

భరణి వచ్చి అడిగాడు, శ్రీజ అయితే ఏకంగా ప్లేటులో భోజనం తీసుకొచ్చి హరీశ్‌కి ఇచ్చింది. అయినా సరే మనోడు మంకు పట్టు వదట్లేదు. మీలాంటోళ్ల మధ్యన ఉండటమే దండగ అనేశాడు. నేను తినను, తాగను అని తెగేసి చెప్పాడు. దీంతో కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్, హరీశ్‌కి జాగ్రత్తలు చెప్పి ఇతడి బాధ్యతని రాము రాథోడ్‌కి అప్పగించాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే నామినేషన్‌ ఇద్దరివే జరిగినప్పటికీ మంచి రంజుగా జరిగాయి.


తొలివారం అంతా తాను చెప్పిందే రైటు, అందరూ అదే వినాలి అనే రేంజులో ప్రవర్తించిన హరీశ్.. తనూజ తన తప్పులు ఎత్తిచూపుతూ నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. తన ప్రవర్తనతో అటు హౌసులోని వాళ్లకు ఇటు చూస్తున్న ప్రేక్షకులకు ఓ రకంగా టార్చర్ చూపిస్తున్నాడు. మరోవైపు మనీష్, రీతూని నామినేట్ చేశాడు.

తొలివారం అంతా కాస్త సైలెంట్‌గానే రీతూ.. మనీష్ చెప్పిన పాయింట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. గిన్నెలు సరిగా తోమడం లేదు, ఇంట్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ అడగట్లేదు అంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. దీనికి ఏ మాత్రం ఊరుకోని రీతూ.. నీదో షిట్ నామినేషన్ అని రెచ్చిపోయింది. మరోవైపు భరణిని కూడా నామినేట్ చేసిన మనీష్..  మీరు హౌసులో ఉన్న పెద్ద స్నేక్(పాము) అనేశాడు. కావాలనే కామనర్స్ మధ్యలో పుల్లలు పెడుతూ గొడవలకు కారణమవుతున్నారని అన్నాడు. ప్రస్తుతానికైతే తనూజ, మనీష్ మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లంతా మంగళవారం ఎపిసోడ్‌లో తమ తమ నామినేషన్స్ పూర్తి చేయనున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mask Man Harish
tanuja
Bigg Boss 9 Telugu
Rithu Chowdary
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.