Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 13, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bhola-shankar-bro-movie_0.jpg

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్‌పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్‌నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్‌ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్‌లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్‌.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!)

చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్‌. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు!

మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు  కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్‌. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం.  ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) 

చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు. 

అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్‌టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్‌స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం.

(ఇదీ చదవండి: జైలర్‌ కలెక్షన్స్‌: టైగర్‌ కా హుకుం.. రికార్డులే రికార్డులు)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bhola Shankar Movie
Chiranjeevi
BRO Movie
Pawan Kalyan
Remake
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.