Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. అమ్మ కోరుకున్నట్లే అనుపమతో కలిసి నటించా: అఖిల్‌ రాజ్‌
ADVERTISEMENT

అమ్మ కోరుకున్నట్లే అనుపమతో కలిసి నటించా: అఖిల్‌ రాజ్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2026 06:12 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
akhil-raj.gif

‘నేనెప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో నటుడిగా భాగం కావాలని కోరుకుంటాను. నా క్యారెక్టర్ నిడివి ఎంత అనేది చూసుకోను. బాగాలేని సినిమాలో మూడు గంటలు కనిపించే కంటే ఓ మంచి సినిమాలో బాగా కుదిరాడు, బాగా నటించాడనే పేరొస్తే చాలు. మార్కెట్, కమర్షియాలిటీ వీటన్నింటి కంటే నాలాంటి నటులను ఒక మంచి సినిమానే ముందుకు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతాను’ అన్నారు యంగ్‌ హీరో,  రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్  అఖిల్‌ రాజ్‌. డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్‌ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 16న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్‌ రాజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ ప్రొడ్యూసర్ జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో విందు భోజనం అనే సినిమా చేశాను. అప్పటి నుంచి ఆ సంస్థతో, వారితో టచ్ లో ఉంటూ వచ్చాను. క్రేజీ కల్యాణం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడు పిచ్ డెక్ లో ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు. అప్పటికి ఇంకా ఈ సినిమా కాస్టింగ్ లోకి ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఉదయ్ క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అడిగారు. చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నరేష్ , అనుపమ, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ కన్ఫర్మ్ అయ్యారు.

→ తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ హిలేరియస్ గా అనిపించింది. నా క్యారెక్టర్ కు ఫన్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయి. నరేష్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ కు ధీటుగా నా క్యారెక్టర్ ను పర్ ఫార్మెన్స్ తో నిలబెట్టాలని అనుకున్నాను. నన్ను ఏం ఆశించి బద్రప్ప అన్న తీసుకున్నాడో గానీ వందశాతం ఉదయ్ గా కనిపించేందుకు ప్రయత్నించాను. రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ కు ముందే ఈ చిత్రంతో నరేష్ గారు, అనుపమ, తరుణ్ భాస్కర్ తో కలిసి నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా.

→ రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. నేను చిన్న రోల్ చేశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో కలిసి నటించు అని మా అమ్మ చెప్పింది. ఆమె కోరుకున్నట్లే అనుపమతో నేను ఈ సినిమాలో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెతో కలిసి నటించడం మొదట్లో భయమేసింది గానీ తను ఇచ్చిన సపోర్ట్ తో హాఫ్ డేలోనే కంఫర్ట్ గా ఫీలయ్యా. ప్రతి సీన్ చేసే ముందు నేను అనుపమ ఎవరెలా చేయాలనేది డిస్కస్ చేసుకునేవాళ్లం. మేము నటీనటులుగా కాకుండా ఆ క్యారెక్టర్స్ లా చూసుకున్నాం. నేను ఏ సినిమా చేసినా వందశాతం ఎఫర్డ్స్ పెడతాను.

→ రాజ్ వెడ్స్ రాంబాయిలో రాజు గా ఎంత ఇన్వాల్వ్ అయి నటించానో ఈ సినిమాలో ఉదయ్ పాత్రలోనూ అంతే హోమ్ వర్క్ చేసి పర్ ఫార్మ్ చేశాను. రాజు వెడ్స్ రాంబాయి లాగే ఈ చిత్రంలో కూడా పక్కింటి కుర్రాడిలాగే కనిపిస్తా. డిగ్రీ పూర్తి చేసుకున్న ఉదయ్ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఉదయ్ పాత్రను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఉదయ్ అనే పాత్రలో ఒక ఎనర్జీ ఉంది. అది చాలా బాగుంటుందని నేను నమ్మాను.

→ నాకు అనుపమకు మధ్య అలసెంద్రవంక సాంగ్ ఉంటుంది. ఆ పాటను డా.గోరటి వెంకన్న గారు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది తెలంగాణ నేపథ్య, యాసతో సాగే సినిమా అయినా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. కంటెంట్ బాగున్న సినిమా విజయానికి యాస, ప్రాంతం అనే బేధాలు అడ్డురావు. పెళ్లిచూపులు సినిమా తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆదరించారు.

→ మనం ఒక లక్ష్యాన్ని నమ్మి కష్టపడి పనిచేస్తే తప్పకుండా రీచ్ అవుతామని నా జర్నీలో తెలుసుకున్నాను. ఈ పండక్కి వచ్చే అన్ని సినిమాలు ఎంజాయ్ చేయండి. మా సినిమాను కూడా థియేటర్స్ కు వెళ్లి చూడండి. మా క్రేజీ కల్యాణం చూస్తూ మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. మా సినిమా ఏ స్టార్ సినిమాకు పోటీ అనుకోవడం లేదు. వాళ్ల సినిమాలు బిర్యానీ అయితే మా సినిమా స్వీట్ లాంటిది. పండక్కి ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి. నా నెక్ట్స్ మూవీ శనార్తి. శనార్తి రూటెడ్ కోర్ కల్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నా.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Akhil Raj
Crazy Kalyanam
Anupama Parameshwaran
Tarun Bhaskar
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

భర్తపై  అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

భర్తపై అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

తలైవా పుట్టినరోజు​​..  రజనీకాంత్‌కు లారెన్స్ భారీ కానుక!

తలైవా పుట్టినరోజు​​.. రజనీకాంత్‌కు లారెన్స్ భారీ కానుక!

కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం

మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం

భర్తపై  అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

భర్తపై అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

‘రామాయణ’లో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌

‘రామాయణ’లో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft