Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
ADVERTISEMENT 

అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!

International Sakshi User Sakshi Sakshi Time Jul 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Musk_Trump.jpg

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్‌ బిల్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్‌: గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మస్క్‌.. తన ఎక్స్‌ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్‌ ప్రతిపాదిత బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. 

ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌ కోసం 250 మిలియన్‌ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్‌.. ట్రంప్‌ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్‌ ఖతాలో పోస్ట్‌ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. 

అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. 

ట్రంప్ పై మరోసారి మండిపడ్డ ఎలన్ మస్క్

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు

  • హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.
  • ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.
  • ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. 
  • అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది.
     

ఈ బిల్లులో..

  • సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. 
  • అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.
  • అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది.
ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
bill
elon musk
protest
New Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.