స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌తో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ ప్రమేయం (డ్రైవర్) లేకపోవడమే కాకుండా, అసలు స్టీరింగ్ వీల్ గానీ, యాక్సిలరేటర్-బ్రేక్ పెడల్స్ గానీ లేని వాహనం సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ కీలక మైలురాయి అని కంపెనీ చెప్పింది.
ఇద్దరు ప్రయాణించేలా..
ఇది కేవలం ఇద్దరు ప్రయాణించేలా డిజైన్ చేసిన పూర్తిస్థాయి డ్రైవర్‌లెస్ టూ-సీటర్ వాహనం. స్టీరింగ్, పెడల్స్ లేకపోవడంతో లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం(బూట్ స్పేస్) లభిస్తుంది. సెంట్రల్ డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ తప్ప ఎలాంటి మ్యాన్యువల్ కంట్రోల్స్ ఇందులో ఉండవు. స్టార్‌లింక్ వీ5 శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ వాహనంలో ప్రయాణికులు 4కే లైవ్ వీడియోలు, గేమింగ్ ఆస్వాదించవచ్చు. దీనిని ‘చక్రాలపై కదిలే కంఫర్టబుల్ లాంజ్’ అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు.
Cybercab is basically a super comfortable lounge on wheels with a great TV and epic sound https://t.co/X1aWKoJdJV
— Elon Musk (@elonmusk) September 3, 2026
రోబోటాక్సీ యాప్ ద్వారా బుకింగ్
ప్రయాణికులు టెస్లా రోబోటాక్సీ యాప్ ద్వారా నేరుగా సైబర్‌క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇద్దరు ప్రయాణించే సైబర్క్యాబ్తో పాటు, నలుగురు ప్రయాణించే మోడల్ వై ఎస్యూవీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ వాహనం 48 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 290-300 మైళ్ల రేంజ్ ఇస్తుంది. ఇప్పటివరకు తమ రోబోటాక్సీలు 10 లక్షల మైళ్లకు పైగా మానవ ప్రమేయం లేకుండా ప్రయాణించినట్లు టెస్లా తెలిపింది. వ్యాపారవేత్తలు సొంతంగా వీటిని కొనుగోలు చేసి నెట్‌వర్క్‌లో తిప్పుకునేలా ఆర్డర్లకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో వాహనం ధర దాదాపు 25,000 డాలర్లు-30,000 డాలర్లు(సుమారు రూ.28 లక్షలు) మధ్య ఉండవచ్చని అంచనా.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!