Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. నిజం వైపు నిలబడే ధైర్యమే విద్య
ADVERTISEMENT

నిజం వైపు నిలబడే ధైర్యమే విద్య

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Oct 19, 2026 02:21 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Christopher-L.-Eisgruber.jpg

విశ్వ‌గురు

అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో 2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ క్రిస్టోఫర్‌ ఎల్‌. ఐస్‌గ్రూబర్‌ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం: 

ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం పట్టభద్రులుగా బయటకు వెళ్తున్న మీ జీవిత ప్రయాణంలో... ఎన్నో ఆనందకరమైన క్షణాలు, వేడుకలు, సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే, మీ జీవితంలోని ఈ కొత్త ప్రయాణం ఒక సంక్లిష్టమైన సమయంలో ప్రారంభమవుతోంది. రాజకీయ విభేదాలు, హింస, వేగంగా మారుతున్న టెక్నాలజీ వంటి సమస్యలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది.

ఇలాంటి సవాళ్లు ఎదురౌతున్న తొలి ప్రిన్స్‌టన్‌ విద్యార్థులు మీరే కాదు. అందుకే, నేటి సమస్యలను అర్థం చేసుకోవడానికి, గతంలో మనకంటే ముందున్నవారి అనుభవాలు, ఆలోచనలు ఉపయోగపడ తాయి. ముఖ్యంగా 1960ల నాటి పరిస్థితులను పరిశీలించడం సహాయపడుతుంది. ఆ సమయంలో కూడా అమెరికాలో, ముఖ్యంగా కళాశాల ప్రాంగణాలలో సామాజిక మార్పు, అశాంతి చోటుచేసుకుంది. 

ఆ దశకంలో ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించిన వ్యక్తి రాబర్ట్‌ ఎఫ్‌.గోహీన్‌. ఆయన ఈ విశ్వవిద్యాలయంలోనే 1940లో బ్యాచిలర్‌ డిగ్రీని, 1948లో డాక్టరేట్‌ను పొందారు. 1957లో, తన 37వ ఏట, ఆయన ప్రిన్స్ టన్‌ విశ్వవిద్యాలయ అధ్యక్షుడయ్యారు. అప్పటికి ఆయన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కూడా లేని ఒక యువ క్లాసిక్స్‌ అధ్యాపకుడు ఒక గొప్ప విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించగలడని విశ్వవిద్యాలయ ట్రస్టీలు ఎలా గుర్తించారో నాకు తెలియదు. కానీ, వారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.

విలువలతో కూడిన గొప్ప నాయకత్వం
2008లో గోహీన్‌ మరణించినప్పుడు, ప్రిన్స్‌టన్‌కు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు విలియం బోవెన్, హెరాల్డ్‌ షాపిరో ఆయనను ‘‘ఆధునిక ప్రిన్స్ టన్ నిర్మాత’’గా కొనియాడారు. గోహీన్‌ నాయకత్వంలో ప్రిన్స్ టన్‌ విశ్వవిద్యాలయంలో మహిళలకు గ్రాడ్యుయేట్, అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ప్రక్రియ ముందుకు సాగింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మైనారిటీ వర్గాల విద్యార్థుల సంఖ్యను కూడా ఆయన పెంచారు. విశ్వవిద్యాలయ పాలనలో మార్పులు తీసుకొచ్చారు. వియత్నాం యుద్ధానికి సంబంధించి తీవ్రమైన వివాదాలు, ఘర్షణలు తలెత్తిన సమయంలో విద్యాసంస్థను సమర్థంగా నడిపించారు.

ఆయన పదిహేనేళ్ల పదవీ కాలంలో ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం 38 కొత్త భవనాలను నిర్మించింది. అధ్యాపకుల సంఖ్య 40 శాతం పెరిగింది. విశ్వవిద్యాలయం గురించి, ఉన్నత విద్య గురించి గోహీన్‌ తన ఆలోచనలను ‘ద హ్యూమన్‌ నేచర్‌ ఆఫ్‌ యూనివర్సిటీ’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఆయన తన పుస్తకాన్ని ఈ మాటలతో ముగించారు: ‘‘విశ్వవిద్యాలయం తన పాత్రను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే... ధైర్యం, సంయమనం ఎప్పుడూ అవసరం. 

ఇదీ చ‌ద‌వండి: ప్రతి వ్యక్తీ ఒక కాంతి!

స్వేచ్ఛాయుత విద్యా విధానాన్ని ప్రేమించే, మానవాళికి మంచి భవిష్యత్తును కోరుకునే వారు ధైర్యంగా నిలబడాలి. ఇలాంటి ధైర్యంతో ముందుకు సాగి నప్పుడు విశ్వవిద్యాలయం తన గతం, వర్తమానం, భవిష్యత్తుపై నమ్మకంగా ఉండగలదు. తన లక్ష్యాలు, ప్రాథమిక విలువలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండగలదు. సమాజంలో తన గొంతును ధైర్యంగా వినిపించగలదు.’’

భయం వీడి.. సత్యం వైపు నడవండి
ప్రిన్స్ టన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ నవలా రచయిత్రి టోనీ మోరిసన్‌ కూడా ఇదే తరహా ఆలోచనలను వ్యక్తం చేశారు. 1996లో ప్రిన్స్ టన్‌ విశ్వవిద్యాలయం 250వ వార్షికోత్సవ సభలో ఆమె ‘ద ప్లేస్‌ ఆఫ్‌ ద ఐడియా, ద ఐడియా ఆఫ్‌ ద ప్లేస్‌ ’అనే శీర్షికన ప్రసంగించారు. తన ప్రసంగం చివర్లో మోరిసన్‌ కూడా గోహీన్ లాగే ధైర్యం గురించి మాట్లాడారు. ప్రిన్స్‌టన్‌కు ఉన్న భిన్నంగా ఆలోచించే సంప్రదాయం ప్రకారం నిజాయితీ, గౌరవం, న్యాయబద్ధత, ధైర్యం వంటి విలువలకు విద్యార్థులు, అధ్యాపకులు గట్టిగా కట్టుబడి ఉండాలని ఆమె ఆశించారు. అమెరికా సుప్రీంకోర్టులో ప్రసిద్ధ న్యాయమూర్తి అయిన లూయిస్‌ బ్రాండీస్‌ కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కును సమర్థిస్తూ ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

‘‘ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు.. స్వేచ్ఛగా భయం లేకుండా ఆలోచించడం ద్వారా, ప్రజాస్వామ్య పాలనా విధానాలతో సమస్యలను పరిష్కరించగలమని నమ్ముతారు’’ అని పేర్కొన్నారు. బ్రాండీస్‌ చెప్ప దలచుకున్న విషయం ఏమిటో, 1960వ దశకంలోని అల్ల కల్లోల పరిస్థితుల్లో రాబర్ట్‌ గోహీన్‌ గుర్తించిన విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది.

ఇదీ చ‌ద‌వండి: అసలు 'చూడటం' అంటే ఏమిటి?

అదేమిటంటే.. ప్రమాదకరమైన ధోరణులను, సమాజానికి హాని చేసే ఆలోచనలను ఎదుర్కోవాలంటే.. పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. చర్చలోఅందరూ ఒక అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ సత్యాన్ని తెలుసుకోవాలనే మన నిబద్ధతకు, సమాజం పట్ల మన బాధ్యతకు కట్టుబడి ఉండాలి. అవి మనల్ని కష్టమైన మార్గాల్లోకి తీసుకెళ్లినా సరే, మనం వెనక్కి తగ్గకూడదు. 

కఠినమైన నిజాలకే పట్టం కట్టండి
లూయిస్‌ బ్రాండీస్, రాబర్ట్‌ గోహీన్, టోనీ మోరిసన్‌ ముగ్గురూ చెప్పినట్లుగా... ప్రజాస్వామ్య స్వపరిపాలన, స్వేచ్ఛ, విద్య అనేవి ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండవు. వాటికి స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం అవసరం. స్వతంత్రంగా ఆలోచించడం అంటే.. అవసర మైనప్పుడు ఇతరుల మద్దతు లేకపోయినా ఒంటరిగా నిలబడగల బలం కలిగి ఉండటం. ధైర్యం అంటే కేవలం ఇతరులకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాదు. మన అభిప్రా యాన్ని మార్చుకోవడానికి కూడా ధైర్యం అవసరం. 
మీరు ఈ విశ్వవిద్యాలయంలో... కొత్త ఆలోచనలను ఆస్వాదించి, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారని ఆశిస్తున్నాను. 

ఈ ప్రపంచానికి మీ జ్ఞానం, మీ నైపుణ్యాలు మాత్రమే కాదు, మీ ధైర్యం కూడా చాలా అవసరం. అందుకే రాబోయే రోజుల్లో, రాబోయేసంవత్సరాల్లో మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. రాబర్ట్‌ గోహీన్‌ చెప్పినట్లుగా, సౌకర్యంగా అని పించే కల్పిత కథల కంటే.. కఠినమైన నిజాలను; ఇతరుల ప్రశంసల కంటే ఆత్మగౌరవాన్ని ఎంచుకోండి. 

సంక్షిప్తంగా చెప్పాలంటే.. రాబర్ట్‌ గోహీన్, టోనీ మోరిసన్‌లు తమ జీవితాల ద్వారా, తమ మాటల ద్వారా, చేతల ద్వారా చూపించిన ప్రిన్స్‌టన్‌ విలువలను మీరు ఎల్లప్పుడూ మీతో పాటు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మీ ముందున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మీఅందరికీ హృదయపూర్వక అభినందనలు! మీ భవిష్యత్తు విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను! 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Princeton University
Sakshi Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌

నరేంద్ర మోదీ (దేశ ప్రధాని) రాయని డైరీ

నరేంద్ర మోదీ (దేశ ప్రధాని) రాయని డైరీ

బ్యాంకు ఉద్యోగి మెడపై క్రాస్‌ సెల్లింగ్‌ కత్తి

బ్యాంకు ఉద్యోగి మెడపై క్రాస్‌ సెల్లింగ్‌ కత్తి

సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!

సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!

దేశాన్ని ఊపేస్తున్న యువ చైతన్యం

దేశాన్ని ఊపేస్తున్న యువ చైతన్యం

అమర్‌ ప్రీత్‌ సింగ్‌ (ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌) రాయని డైరీ

అమర్‌ ప్రీత్‌ సింగ్‌ (ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌) రాయని డైరీ

మరిన్ని వార్తలు

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు

ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft