Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. మన బ్రెయిన్‌ చిప్‌ లాకైందా?
ADVERTISEMENT 

మన బ్రెయిన్‌ చిప్‌ లాకైందా?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-1411776304.jpg

అభిప్రాయం

ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్‌ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ ఒడెడ్‌ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.

కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? 
ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని  ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. 

భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్‌ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్‌ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్‌ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.

ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్‌ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.

ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...
ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్‌ లాక్‌ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్‌ ఆత్మ కథ ‘ఎ ఫుల్‌ లైఫ్‌’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. 

కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్‌ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్‌ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్‌ ఇంజినీర్‌ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్‌ ఫర్‌ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్‌గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. 

స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్‌ గవర్నర్‌. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్‌ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్‌ లాక్‌ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్‌ నిరూపించాడు.

కృత్రిమ మేధ ప్రపంచంలో...
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్‌కు చెందిన యువల్‌ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. 

ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్‌ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.

అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్‌ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.

వేల ఏండ్లు మెదడు చిప్‌ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం  కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్‌ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్‌ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. 

అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్‌ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
human brain
Intelligence
genetic changes
Kancha Aialaiah
Guest Column
caste
marriages
intercast marriage
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

హైటెక్‌ – హైరిస్క్‌

హైటెక్‌ – హైరిస్క్‌

వరం ఎలా కోరాలి?

వరం ఎలా కోరాలి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.