Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. యోధుడొకరు... విప్లవ వీరుడొకరు
ADVERTISEMENT 

యోధుడొకరు... విప్లవ వీరుడొకరు

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Apr 13, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AMBEDKAR--GEORGE-REDDY_FULL.jpg

భారతదేశ చరిత్రలో ఏప్రిల్‌ 14 ఒక మైలురాయి వంటిది. సమాజంలో మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, భగత్‌ సింగ్, సుభాష్‌ చంద్రబోస్, బాబూ జగ్జీవన్‌రామ్‌ వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ కోవకు చెందినవారే అయిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14. ఈ తేదీకే ఇంకో ప్రాముఖ్యం కూడా ఉంది.



యూనివర్సిటీలలోనే సమాజం మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అమర వీరుడైన రోజు కూడా ఇదే! ఇద్దరి ఆశయం సమాజంలోని అసమానతల్ని నిర్మూలించడమే! అంతరాలు లేని మానవీయ సమాజాన్ని నిర్మించడమే! ప్రయాణించిన మార్గాలు వేరైనా, ఇద్దరూ అడుగడుగునా సమాజ హితం కోసం పోరాడిన వారే! అందుకే ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం. చరిత్రపుటల్లో ఇంతటి ప్రత్యేక స్థానం.

సమాజంలోని కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలనకు అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు అవసరమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినవారు అంబేడ్కర్‌. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు అందకుండా పోతున్న సమయంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ లాటిన్‌ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరిచే పోరాటంలో మతోన్మాదుల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి.



నేటి ‘ప్రగతిశీల ప్రజా స్వామిక విద్యార్థి సంఘం’ (పీడీఎస్‌యూ) స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు, సామాజిక న్యాయం కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయి నప్పటికీ.. స్ఫూర్తి చేతనలను ప్రేరేపించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. అంబేడ్కర్‌ సమసమాజ స్థాపన కోసం పాటు పడితే, జార్జిరెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు. అంబే డ్కర్‌ ఒక ధ్రువతార అయితే, జార్జిరెడ్డి ఒక అరుణతార. ఇద్దరూ చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకున్న వారే. ప్రజల గుండెల్లో నిలిచి పోయినవారే.



ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమా నత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే. ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచనాపరులే. సమాజ హితం కోసం అడుగడుగునా పోరాడిన వీర యోధులే.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14 నాలో ఒక సంఘర్షణను రేపుతుంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేల కొరిగిన దినం! ఒకరిది పుట్టుక, ఒకరిది మరణం.



ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? ‘సమీకరించు, బోధించు, పోరాడు’.. అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు; ‘జీనా హైతో మర్‌నా సీఖో... కదం కదం పర్‌ లడ్నా సీఖో’ అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు. పుట్టినవారు మరణించక తప్పదు అని తెలిసినా, ఆ ఆలోచనకు ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ అమరత్వం రమ్యమైనది. మనిషి తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం.



కానీ సమాజం కోసం, సమాజంలోని బాధితుల తరఫున గళమెత్తి, కలమెత్తి పోరాడి, పరుల కోసం మరణించడం రమ్యమైన అమరత్వం కాక మరేమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి క్షణం పేదవారి గురించే ఆలోచించి, ఏ మాత్రం స్వార్థం లేకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు.



ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం  ఒక్కటే... మతోన్మాద మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం. ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’’ అని గురజాడ గారన్నట్లు  జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని, విద్య ద్వారానే అసమానతలు, అంతరాలు తొలగిపోతాయని ఇద్దరూ నమ్మారు. రిజర్వేషన్‌ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యాగంధానికి నోచుకునేలా అంబేడ్కర్‌ కృషి చేశారు. 



కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్‌. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జిరెడ్డి. ఇద్దరి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయం. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయాలను, అక్రమాలను, అవమానాలను భరించి... కుల ఆధిపత్యా నికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను పీడితులను చైతన్య పరిచారు. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేదల, శ్రామికవర్గ, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి.



1972లో కామ్రేడ్‌  జార్జిరెడ్డిని ‘సంఘ్‌ పరివార్‌’లోని కొన్ని మతో న్మాద హిందూత్వ శక్తులు హత్య చేశాయి. నాటి పరిస్థితులే నేటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నేడు కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకా లను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడా నికి ప్రయత్నించిన, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజా స్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి పరి శోధనలు జరపడానికి లేకుండా వారిని అడ్డుకుంటూ,  మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించడం జరుగుతోంది.



అదే సమయంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆతురతను కనబరుస్తున్నాయి. అందుకే అన్న ట్లుగా ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి  ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ విధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.



రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా నేడు బలంగా లేదు. అయినా నిరుత్సాహ పడనవసరం లేదు. ప్రజాస్వామిక, మానవీయ విలువలు పెంపొంది ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబే డ్కర్, జార్జిరెడ్డిల ఆశయాలు నెరవేర్చే అవకాశం ప్రగతి శీలులందరికీ ఉంటుంది.



చదువే ఆయుధంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది బడుగువర్గాల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అవిరళ కృషి చేసిన అంబేడ్కర్‌ జీవితాన్ని; అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పులేనప్పుడు ఎవరినైనా ఎది రించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగగుణం, సమ సమాజం కోసం  పరితపించే మనస్తత్వం గల జార్జిరెడ్డి పంథాను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. జార్జిరెడ్డి ఆందోళన , పోరాటాలతోపాటు నిరంతర అధ్యయనశీలిగా గడిపారు.



పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించారు. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి అతడు. భౌతిక శాస్త్రంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి స్కాలర్‌ అయిన జార్జి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంబేడ్కర్‌ ప్రబోధించిన విలువలతో నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడాలి. ఈ ఇద్దరు వీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన, ఘనమైన నివాళి ఇదే!



తండ సదానందం 

వ్యాసకర్త టి.పి.టి.ఎఫ్‌. రాష్ట్ర కౌన్సిలర్‌

మొబైల్‌: 99895 84665 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Dr Br Ambedkar
George Reddy
Guest Column
sadanandam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

హైటెక్‌ – హైరిస్క్‌

హైటెక్‌ – హైరిస్క్‌

వరం ఎలా కోరాలి?

వరం ఎలా కోరాలి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.