Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ‘కోహినూర్‌ను బ్రిటన్‌ దొంగిలించింది’
ADVERTISEMENT 

‘కోహినూర్‌ను బ్రిటన్‌ దొంగిలించింది’

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jan 23, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
britain.jpg

బ్రిటన్‌ రాజకుటుంబ కథనాలంటే ఇప్పటికీ ఆసక్తికరమే. పైగా ప్రిన్స్‌ హ్యారీ దూకుడుగా వెలువరించిన ‘స్పేర్‌’ చదవడానికి మరింత ఆకర్షణీయం. తల్లి డయానా నాటకీయ మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్నీ, తానొక ‘స్పేర్‌’గా ఊరికే అలా పక్కనుండాల్సిన స్థితినీ రాశాడు. అలాగే అనేక ఇబ్బందికర విషయాలను పంచుకున్నాడు. అయితే కోహినూర్‌ వజ్రం గురించిన హ్యారీ ఆలోచనలు మాత్రం భారతీయులకు సంతోషం కలిగిస్తాయి.

బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ రాసిన ‘స్పేర్‌’ పుస్తకం చదివినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడేది దాన్ని రాసిన విధానమే. శైలి బిగువుగా, ఉద్రిక్తభరితంగా, ఒక్కోసారి అసంగతంగానూ ఉంటుంది. చెప్పాలంటే ఒక థ్రిల్లర్‌లా ఉంటుంది. కాబట్టే ఇది చదవడానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులోని భాషలో లోతు తక్కువ. విషయం వదులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈటన్‌ స్కూల్, అఫ్గానిస్తాన్‌లలో హ్యారీ గడిపిన సమయాల గురించి వివ రిస్తున్నప్పుడు పైపైన సాగుతుంది. అప్పుడు నిస్సారంగా ఉండి, చికాకు కలిగిస్తుంది కూడా. 

తప్పనిసరిగా కనబడేవి మరో రెండు అంశాలు. తన తల్లి (డయానా) నాటకీయ మరణం కలిగించిన వేదన నుంచి హ్యారీ బయటపడలేదు. ఈ పుస్తకం మొత్తంగా ఇదే మానసిక స్థితి కొన సాగు తుంటుంది. అయితే ఇది అర్థం చేసుకోదగినదే. అర్థం కానిదల్లా ఏమి టంటే, తానొక ‘స్పేర్‌’(అలా పక్కన అందుబాటులో ఉండటం)గా ఉండాల్సిన వాస్తవం గురించి ఇంకా సమాధాన పడక పోవడమే. 38 సంవత్సరాల వయస్సులో కూడా ఏ హోదా లేదు. తన సోదరుడు విలి యమ్‌తో బాంధవ్యంపై ఇది స్పష్టమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఈ కారణంగానే స్కూల్‌లో విల్లీ (విలియమ్‌ను హ్యారీ ఇలాగే పిలు స్తాడు) తన పట్ల పట్టనట్టుగా ఉన్నాడని హ్యారీ నమ్మకం.

పుస్తకంలోని మూడో అంశం ఏమిటంటే – రాజ కుటుంబానికీ, వెంటాడే ఫొటోగ్రాఫర్లకూ (పాపరాజ్జీ) మధ్య సాగిన అంతులేని పోరాటం. ‘‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వ వద్దు’’ అనేది రాజ కుటుంబ నినాదంగా ఉండేది. హ్యారీ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. పబ్‌లో రాత్రంతా గడిపిన తర్వాత తన కారు డిక్కీలో దాక్కునే వాడినని చెప్పాడు. డయానా కూడా అలాగే చేసివుంటుందని హ్యారీ అంటాడు. ఈ పుస్తకం చాలా విషయాలను వెల్లడిస్తుంది. వాటిలో చాలా వరకు తీవ్రమైనవి, కొన్ని మనోహరమైనవి. బాక్సర్‌ షార్ట్స్‌లో శీర్షాస నాలు వేసే అతడి తండ్రి, బ్రిటన్‌ రాజు చార్లెస్‌ ‘డార్లింగ్‌ బాయ్‌’ అని హ్యారీని పిలుస్తారు. ఇక విలియమ్‌ అతడిని ‘హెరాల్డ్‌’ అంటాడు. కానీ అలా ఎందుకంటాడో పుస్తకంలో ఎక్కడా ఉండదు. అయితే, ‘‘నాతో వ్యవహరించినప్పుడల్లా ఏ మార్పూ లేకుండా’’ అదే ‘‘సుపరి చితభ్రుకుటి’’ అని మాత్రం చెబుతాడు. ఇక  బాల్మోరల్‌ రాజమందిరంలో పిల్లలుగా ఉన్నప్పుడు, క్వీన్‌ విక్టోరియా విగ్రహాన్ని ఎప్పుడు దాటు కుని వెళ్లినా వారు ప్రతిసారీ వంగి నమస్కరించేవారు.

ఈ పుస్తకంలోని చాలా వివరాలు అనవసరం. పైగా అవి ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటన్నింటినీ హ్యారీ ఎందుకు పంచు కున్నాడని మీరు ఆశ్చర్యపడతారు కూడా. ఉదాహరణకు, హ్యారీ తనకు తడి అయిందనీ (స్ఖలనం), దాన్ని దాచిపెట్టడానికి సముద్రంలోకి దూకేశాననీ  చెబుతాడు. మేగన్‌ మెర్కెల్‌తో తన తొలి డేట్‌కు కొద్ది గంటల ముందు అలా జరిగింది. రాజకుటుంబీకులు, వారి స్కాటిష్‌ సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని అనిపించే ఒక కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యారీ తొలిసారి ఒక మగజింకను కాల్చినప్పుడు అతడి గైడ్‌ అయిన శాండీ ఆ మృతకళేబరపు చర్మాన్ని చీల్చి, యువరాజు హ్యారీని మోకాళ్లపై కూర్చో బెట్టి, అతడి తలను అందులోకి దూర్చాడట. ‘‘దీంతో ఉదయం నేను తిన్న ఫలహారం కడుపులోంచి బయటకు వచ్చేసింది’’ అని హ్యారీ రాస్తాడు. ‘‘నేను దేన్నీ వాసన పీల్చలేకపోయాను. ఎందుకంటే నేను శ్వాస పీల్చలేకపోయాను’’ అని చెబుతాడు. ‘‘నా నోరు, ముక్కు పూర్తిగా రక్తంతో, పేగులతో నిండిపోయాయి. ఒక తీవ్రమైన అసౌక ర్యపు వెచ్చదనం’’ అని చెబుతాడు. ఈ ఆచారం ముగియగానే, హ్యారీ ముఖంపై పడిన జింక రక్తాన్ని తుడవవద్దని శాండీ చెప్పాడట. ‘‘దాన్ని అలాగే ఎండిపోనీ, కుర్రాడా, అలాగే ఎండిపోనీ!’’ అన్నాడట.

బ్రిటిష్‌ రాజకుటుంబంలో ఇద్దరు సభ్యులను హ్యారీ అంగీకరించలేకపోయాడు. ఒకరు మార్గరెట్‌ (ఎలిజబెత్‌ రాణి చెల్లెలు). ఆమెను అతడు ఆంట్‌ మార్గో అని పిలుస్తాడు. ఒకసారి ఆమె క్రిస్‌మస్‌కు మామూలు బాల్‌పాయింట్‌ పెన్‌ ఇచ్చిందట. అయినా వాళ్లిద్దరూ కలిసి సాగాల్సి వుంది. ఎందుకంటే, హ్యారీ నొక్కిచెప్పినట్టుగా ఆమె కూడా తనలాగే ఒక స్పేర్‌. ఇక హ్యారీ అంగీకరించని మరొకరు కెమిల్లా. ఆమెను పెళ్లాడవద్దని హ్యారీ, విలియమ్‌ ఇద్దరూ తమ తండ్రి చార్లెస్‌కి చెప్పారు. ఆమెను ‘ప్రమాదకారి’గా హ్యారీ పరిగణిస్తాడు. తన ఇమేజ్‌ను పెంచుకునే క్రమంలో ఆమె మీడియాకు పలు కథనాలు బహిర్గతం చేశారంటాడు.

రెండు విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ పుస్తకంలో దోడీ ఫయీద్‌ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అతడిని హ్యారీ అంతటా ‘మమ్మీ బాయ్‌ఫ్రెండ్‌’ అనే రాశాడు. ఇంకా తనకు ‘పాకీ’ అంటే జాతి వివక్షా పదమనీ, అవమానించినట్టనీ తెలియదని పేర్కొన్నాడు. అంతిమంగా, గూర్ఖాల పట్ల హ్యారీకి ఉన్న ఆత్మీయతకు భార తీయ పాఠకులు సంతోషపడతారు. లెఫ్టినెంట్‌ వేల్స్‌ అని హ్యారీని సంబోధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎల్లప్పుడూ ‘సాబ్‌’ అనేవారు. ‘‘రాజరికం పట్ల వాళ్లకు గంభీరమైన పూజ్యభావం ఉంది. వారి దృష్టిలో రాజు అంటే దైవం. కాబట్టి రాజకుమారుడు కూడా దైవా నికి మరీ దూరం కాదు’’. ఇక కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌ కలిగివుండటంలోని న్యాయ సమ్మతిని హ్యారీ ప్రశ్నించడం మన ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. ‘‘బ్రిటిష్‌ సామ్రాజ్యం తన ఉచ్చదశలో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకో ఆలోచన, దొంగిలించింది’’ అని అంటూ ఇలా కొన సాగిస్తాడు. ‘‘అది శాపగ్రస్తమైందని నేను విన్నాను.’’

కరణ్‌ థాపర్‌ 

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Karan Thapar
British
Kohinoor diamond
Guest Column
Britain
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

హైటెక్‌ – హైరిస్క్‌

హైటెక్‌ – హైరిస్క్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.