Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

నీరు లేదు... నిప్పు లేదు.. అడవిలో ఆ నలుగురు

Family Sakshi User Sakshi Sakshi Time Apr 16, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nirmal-forest-1.jpg

తెలిసిన అడవే. కాని ఉరుములు మెరుపులతో చీకటి పడిపోయింది. దారి తప్పారు. ఊరి వైపు కాకుండా అడవిలోకి వెళ్లిపోయారు. నలుగురు స్త్రీలు... తునికాకు కోసం వెళ్లి రాత్రంతా అడవిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు. వారి కథ గగుర్పాటు కలిగించేలా ఉంది. ధైర్యాన్ని నూరిపోసేలా కూడా. చిత్రమేమిటంటే తిరిగి వచ్చేప్పుడు పోలీసులు కూడా దారి తప్పారు. అంత మాయలమారి అడవి అది.

‘రాధ ఆడ నీ పక్కకున్న కట్టెలందుకోయే..’‘ఏంటికే లింగవ్వ.. కట్టెలకు మంట పెడదమంటే మన తాన అగ్గిపుడక కూడ లేదు గదనే..’ ‘లేదే.. ఏదో సప్పుడైతుంది. గుడ్డెలుగులో, అడివిపందులో చీకట్ల తెలుస్త లేదే. కట్టె పట్టుకుని సప్పుడు చేస్తే దూరం పోతయని...’ చెట్టు మొదట్లో కాళ్లు ముడుచుకుని, చుట్టూ ఉన్న చీకట్లను భయంగా చూస్తూ చెబుతోంది లింగవ్వ. ‘ఈ చిమ్మచీకట్లల్ల ఆడోళ్లం ఏం చేస్తం. ఏదచ్చినా ఏం చేయలేం. ఇగ మనకు దేవుడే దిక్కు. తెల్లారితేనే మన బతుక్కు ఏమన్న తోవ దొరుకతదేమో..’అని రాధతో పాటు సరోజ, లక్ష్మి మాట కలిపారు. 

రోజూ రాత్రి ఏడింటికే నిద్రపోయే ఆ నలుగురు.... ఆ రాత్రిపూట కనీసం కనురెప్ప వాల్చలేదు. ఏ దిక్కు నుంచి ఏమొస్తుందోనన్న ఆందోళనతోనే రాత్రంతా గడిపారు. తమ జీవితంలో ఇలాంటి ఓ రాత్రి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తెల్లారిన తర్వాతే వాళ్ల జీవితాలకు వెలుగొచ్చింది.

అడవిలో చిక్కుకున్నారు
నిర్మల్‌ జిల్లా మామడ మండలం కప్పన్ పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ అనే నలుగురు మహిళలు ఈనెల 10న తునికాకు సేకరణ కోసం అటవిప్రాంతానికి వెళ్లి దారి తప్పారు. దాదాపు 15 గంటలపాటు దట్టమైన అడవిలోనే చిక్కుకుపోయారు. రాత్రంతా భయంకరమైన చీకటిలో అటవీ జంతువుల మధ్య గడిపారు. ఆ నలుగురూ సాదాసీదా కుటుంబాలకు చెందిన మహిళలే. ఈ సీజన్ లో తునికాకు సేకరించి పెట్టుకుంటే నాలుగు పైసలు ఎక్కువొస్తయనుకునే చిన్నపాటి ఆశలున్నవాళ్లే. అందుకే ఈ నెల 10న కప్పన్ పల్లిలో రోజంతా కూలి పనులు చేసుకుని, మధ్యాహ్నం 3.30 గంటలప్రాంతంలో నలుగురు కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లారు.

తునికాకు ఏరుతూ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. ఇకచాలు ఇంటికెళ్దాం అనుకునే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం వారిని కంగారు పెట్టాయి. ఇళ్లకు వెళ్లాల్సిన దారి తప్పిపోయారు. తాము ఊరివైపు కాకుండా అడవిలోనే మరోవైపు వెళ్తున్నట్లు గ్రహించారు. కానీ అప్పటికే రాత్రి ఎనిమిదైంది. నలుగురిలో ఒకరైన రాధ దగ్గర సెల్‌ఫోన్  ఉన్నా అక్కడ సిగ్నల్స్‌ లేవు.

ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రంతా చిమ్మచీకట్లో దట్టమైన అడవి ఒడిలో బిక్కుబిక్కుమంటూ మంటూ ఉండిపోయారు. మరోవైపు చీకటి పడుతున్నా తమవాళ్లు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. సమీప అటవీప్రాంతాలన్నీ గాలించారు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలో పోలీసులు
సమాచారం అందిన క్షణం నుంచి ఎస్పీ జానకీ షర్మిల అలర్ట్‌ అయ్యారు. నలుగురు మహిళలు, అదీ లోయలు, గుట్టలతో ఎలుగుబంట్లు, అడవి పందులు ఉండే దట్టమైన అడవిలో తప్పిపోవడంతో వారికేం కాకుండా వీలైనంత త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొందరు గ్రామస్తులతో కలిసి బృందాలుగా వెళ్లాలంటూ తమవాళ్లకు సూచించారు. రాత్రంతా ప్రయత్నం చేసినా దట్టమైన అడవిలో   మహిళల జాడను కనుక్కోలేకపోయారు.

ఆ చెట్టే దిక్కనుకుని..
మరోవైపు అడవిలో ఆ చీకట్లో సెల్‌ఫోన్  టార్చిలైట్‌ ఆన్  చేసుకుని ఆ నలుగురు చాలా దూరమే నడిచారు. అలా ఎంతసేపు నడిచినా లాభం లేదనుకుని ఓ పెద్దచెట్టును చూసుకుని దాని దగ్గరే కూర్చున్నారు. వారందరికీ ఆ చెట్టు ఆసరా ఇచ్చింది. గాలివాన రాని, ఏ జంతువూ రాని ఏమైనా కానీ పొద్దున వరకు ఈ చెట్టు దగ్గర నుంచి కదలొద్దని నిశ్చయించుకున్నారు. ఏవైనా జంతువులు వస్తే చప్పుడు చేసి చెదరగొట్టడానికి తలో కట్టె చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఒకరికొకరు పైకి ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ మనసుల్లో మాత్రం ఏదో తెలియని భయం. నాలుగు గోడల మధ్య పిల్లాపాపలతో గడిపేవాళ్లకు ఆ రాత్రి ఓ నరకంలా గడిచింది. ఎప్పుడూ వినని జంతువుల చప్పుళ్లు, కళ్లు పొడుచుకుని చూసినా కానరానంత చీకట్లో కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారు.

తెల్లారితేనే..
ఆ నలుగురు కొన్ని గంటల వ్యవధిలో పగలు, రాత్రిని కళ్లారా చూశారు. శుక్రవారం ఉదయం తెల్లవారగానే సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్తే ఏమైనా ఊళ్లు కనిపిస్తాయేమోనన్న ఆశతో ఆ గుట్ట ఎక్కారు. కనుచూపు మేరలో ఊళ్లు కనిపించలేదు గానీ.. తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ లో సిగ్నల్స్‌ కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చింది. 

⇒ వెంటనే తమ వాళ్లకు ఫోన్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో నిర్మల్‌ ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. తమ వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లను తెప్పించి అడవి లోపలికి వెళ్లారు.  సెల్‌ఫోన్  సిగ్నల్స్‌ ఆధారంగా డ్రోన్  కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సాయంతో వారిని చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కూడా తప్పిపోయారు. ఆఖరుకు డ్రోన్‌ను ఫాలో అవుతూ గమ్యాన్ని చేరారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

⇒ మాకు తిండి, నీళ్లు లేవు. దారి తప్పాక అట్లనే రెండు మూడు గంటలు నడుసుకుంట అరుసుకుంటనే తిరిగినం. చివరికి నీరసంతో అరవడానికి శక్తి లేకుండా అయిపోయింది. – బత్తుల సరోజ

⇒ ఇన్నేళ్లలో ఇట్లా ఎప్పుడు కాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ల దారి తప్పిపోయినమో కూడా గుర్తుకొస్తలేదు. రాత్రికి ఏమన్న జంతువులస్తయేమోనని నేను కొంచెంసేపు చెట్టెక్కి కూసున్న. ఆ రాత్రిని చూసినంక ఇగ తిరిగొస్తమనుకోలేదు. ఇప్పటికీ మనసుల నుంచి దడుకు పోతలేదు. – కంబాల లింగవ్వ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nirmal
Police
rescue
missing
women
forest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

 హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు

తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.