Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

తీసేయ్.. తీసేయ్.. అందర్నీ డిలీట్ చేసేయి స్వామీ

Family Sakshi User Sakshi Sakshi Time Dec 31, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Newyear_sakshi_Special.jpg

దేముడా.. ఓ మంచి దేముడా.. నా జీవితంలో ఇంకో ఏడాది గడిచిపోయింది..  వయసు ఏడాది పెరిగింది తప్ప జీవితంలో మార్పులేం రాలేదు.. కాలం మారింది.. మారిందంటే వానాకాలం పోయి చలికాలం వచ్చిందని కాదు.. కాలాన్ని బట్టి మనుషులు బుద్ధులు మారినై అంటున్నా.. మనుషులు మారినారు.. అదిగో మళ్ళా మనుషులు మారడం అంటే ఆడోల్లు మగాళ్లుగ.. మగాళ్లు ఆడోళ్లలా మారడం కాదు.. మనిషి తీరు మారింది అంటున్నా.. మీ దేవుళ్ళు మాత్రం యుగయుగాలుగా ఒకేలా ఉంటున్నారు కానీ.. 

మావాళ్లేంది సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారు.. నువ్వు పుట్టించినప్పుడే పర్మినెంట్ చిప్ కదా పెట్టాలి.. మంచివాడికి ఒక చిప్.. అంటే వాడు చచ్చేవరకు మంచివాడిగా ఉండాలి.. వెధవలకు ఇంకో చిప్.. అలా పెడితే బాగుణ్ణు కదయ్యా.. మొబైల్ ఫోన్లలో ఆటో అప్డేట్ ఉన్నట్లు .. ఫోన్లో సెట్టింగ్స్ మారిపోతున్నట్లు ఫ్రెండ్స్.. చుట్టాలు.. బంధువులు కూడా అప్డేట్ ఐపోతున్నారు స్వామి.. అంటే వాళ్ళంతట వాళ్లే మారిపోతున్నారు.. నేనేమో ఇంకా వాళ్ళు ఎప్పట్లానే ఉన్నారేమో అని చూస్తుంటే ఫోన్లో యాప్స్ సపోర్ట్ చేయనట్లుగానే వాళ్ళు నా మైండ్ సెట్ కు సూటవకుండా ఫోన్ కు..  బ్లూ టూత్ కనెక్ట్ కాకుండా ఉంటున్నట్లు ఉండిపోతున్నారు.

అంతా రివర్స్ లో ఉంటోంది ఏంది స్వామీ
అదేంటో స్వామీ.. నేను నాలుగేళ్ళ క్రితం వరకూ నానా ఇబ్బందులో ఉండేవాణ్ణి.. ఆ సమయంలో కాస్త కలిగిన మా చుట్టాలంతా నావాళ్ళ మాదిరిగానే ఉండేవాళ్ళు. నా ఉద్యోగం పోయిందని సంతోషంతోనో.. వీడికి బాగా అయిందన్న ఆనందంతోనో తెలీదు కానీ ఎంతోమంది పలకరించారు. వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసమేనేమో.. బియ్యం పంపిన బంధువులు.. వెయ్యి వేసిన చుట్టాలు ఉన్నారు.. కానీ ఆ వెయ్యి.. ఆ బియ్యం వాళ్ళ దాతృత్వాన్ని చెప్పుకోవడానికి.

నా అసమర్థతను చాటడానికి వాడుకున్నారని తరువాత తెలిసింది. అదేంటో స్వామి..   విత్తనాల్లో కల్తీ.. ఆహారంలో కల్తీ.. నూనెకల్తీ.. టీపొడి కల్తీ విన్నాను కానీ ఈ ఏడాది ఏకంగా బంచువుల్లోనే కల్తీగాళ్లను చూసాను స్వామి.. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు.. పోన్లే అభిమానంతో పిలిచారేమో అని వెళతానా.. కూర్చోబెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ నా అసమర్థతను .. నా పేదరికాన్ని తరచూ గుర్తు చేస్తున్నారు.. అవమానంతో ముద్ద గొంతు దిగలేదయ్యా.. పోనీ బయటి బంధువులు ఎవరో ఇలా చేశారంటే ఒకే ఒకే.. అందరూ నావాళ్లు.. ఆత్మీయులు అని నమ్మినవాళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎవర్ని నమ్మాలయ్యా ..

కూట్లో బుగ్గిపోసే రకం
నాతో గడిపి గడిపి కష్ఠాలు.. బాధలకు కూడా బోరొచ్చిందేమో.. నాక్కాస్త గ్యాపిచ్చాయి.. రాత్రి పగలు కష్టించాను.. చిన్నా పెద్ద .. ఏపని దొరికితే అది చేశాను..  చిన్న ఉద్యోగం.. పదిరూపాయలు ఆదాయం.. కాస్త నడుపునిండా బువ్వ.. ఇంట్లో భార్యాబిడ్డలతో కాసిన్ని స్మైలీ సన్నివేశాలు దొరికాయి. వాటిని ఫోన్లో స్టోర్ చేసేలోపే మళ్ళీ ఫేక్ పాత్రధారులు ఎదురయ్యారు. ఏంటీ ఏదో ఆఫర్ తగిలిందట కదా.. ఏదో అయిందట కదా అంటూ ఓ ఫంక్షన్లో సెటైర్లు.. కొందరు ఇలాగే రాత్రికిరాత్రి ఎదిగిపోతుంటారు అంటూ ఎత్తిపొడుపులు.. నేను నిద్రపోని రాత్రులు.. ముద్ద తినని పొద్దులు.. నడిచి నడిచి తిరిగిన నా కళ్ళు.. కునుకు లేక ఇంకిన నా కళ్ళు... ఇవన్నీ వీళ్లకు తెలుసా ? తెలీదు.. నేను ముద్దలేక ఏడుస్తుంటే సంబరంలో వీళ్ళీ.. నేను కడుపునిండా తింటుంటే కడుపు మంటతోనూ వీళ్ళే .. వద్దు స్వామి.. ఇలాంటి నకిలీలు నాకొద్దు.. వీళ్ళను నానుంచి తీసెయ్యి.. ఫోన్లనుంచి నంబర్లు తీసేసినట్లు నా మైండ్ నుంచి వెళ్ళాను తీసెయ్యి.. ఒరిజినల్ .. మనసున్నవాళ్లను నాకు దగ్గర చెయ్యి.. ఈ కొత్త ఏడాదిలో నాకు ఇంకేం వద్దు.. ఒరిజినల్ మనుషులను ఇవ్వు చాలు..
-సిమ్మాదిరప్పన్న

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Simmadhirappanna
Happy New Year 2025
Old memories
Resolutions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!

హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!

జర్రమొచ్చింది.. సైలెంట్‌ మోడ్‌లో సేనాని!

జర్రమొచ్చింది.. సైలెంట్‌ మోడ్‌లో సేనాని!

నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..

నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..

రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!

రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!

చిట్టి చిలకమ్మా.. ఎక్కడికెళ్లింది..

చిట్టి చిలకమ్మా.. ఎక్కడికెళ్లింది..

రఘురామను రఫ్ఫాడిస్తున్న ఐపీఎస్

రఘురామను రఫ్ఫాడిస్తున్న ఐపీఎస్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.