Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!

Family Sakshi User Sakshi Sakshi Time Mar 15, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
food.jpg

మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్‌ కేటరింగ్‌ సర్వీస్‌ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే..

చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టు​వులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక​​ శరత్‌ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్‌ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు.

ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్‌ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్‌ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్‌ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్‌ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్‌ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.

వెంటనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్‌ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్‌లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్‌ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్‌ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్‌ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్‌ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు.

తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. 

బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ  ఎన్నడూ బాబోయ్‌! నావల​ కాదని  పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్‌ బాబు. ఇతడి ‍ కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! 

(చదవండి: నటుడు అర్జున్‌ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Sarath Babu
food
King
CEO
sucess
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

అడవి ఆమెను సీఈఓ చేసింది...

అడవి ఆమెను సీఈఓ చేసింది...

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌  21 రోజుల్లోనే..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌ 21 రోజుల్లోనే..

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

80 గంటల పని.. అమెజాన్‌ అనుభవాలు చెప్పిన సీఈవో!

80 గంటల పని.. అమెజాన్‌ అనుభవాలు చెప్పిన సీఈవో!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.