Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సరదా పాటలు..దాండియా ఆటలు..!

Family Sakshi User Sakshi Sakshi Time Sep 22, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dandi.jpg

దాండియా ఆటలు.. ఆడ.. సరదా పాటలు పాడ అంటూ నగర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలకు ఏర్పాటు జరుగుతున్నాయి. వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు పలువురు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఈవెంట్స్‌కు భిన్నంగా మొత్తం 10 రోజుల పాటు సందడి కొనసాగడమే నవరాత్రి సంబరాల ప్రత్యేకత. ఈ 10 రోజులూ దాండియా–గర్భా నృత్యాల హోరులో నగరవాసులు మునిగితేలనున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ డీజేలు, ఫుడ్‌ స్టాల్స్‌తో పాటు ఫ్లీ మార్కెట్స్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సంప్రదాయంతో పాటు ఆధునికతనూ కలగలిపి డిజైన్‌ చేస్తున్న ఈవెంట్స్‌ సకుటుంబ సపరివార సమేతంగా అలరించనున్నాయి. 

క్లబ్స్‌తో పాటు, ఫంక్షన్‌ హాల్స్, ఉద్యానవనాలు, ఓపెన్‌–ఎయర్‌ వేదికలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఈ దాండియా/గర్భా ఈవెంట్స్‌కు వేదికలుగా మారనున్నాయి. ప్రధానంగా బ్యాండ్‌ ప్రదర్శనలు, డీజే, ఫుడ్‌ స్టాల్స్, వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. టికెట్‌ ధరల విషయానికి వస్తే కొన్ని ఈవెంట్స్‌ బడ్జెట్‌–ఫ్రెండ్లీగా ఉంటే, సగటున రూ.500 ధరలో అందుబాటులో ఉన్నాయి. 

అయితే ఏదైనా పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీ ప్రదర్శనలు ఉంటే లేదా ప్రీమియం వేదిక అయితే ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఈవెంట్స్‌ సెపె్టంబర్‌ 20 నుంచి ప్రారంభమై, నవరాత్రి ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో జరిగే కొన్ని కార్యక్రమాల గురించిన సమాచారం ఇది.. 

ఓపెన్‌ ఎయిర్‌ వేడుక.. 
నగరంలోని అతిపెద్ద ఓపెన్‌–ఎయిర్‌ వేదిక అయిన జూబ్లీహిల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో హైదరాబాద్‌ దాండియా ఉత్సవ్‌ జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు నృత్యం, సంగీతం సహిత వేడుకలను అందిస్తుంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఓపెన్‌–ఎయిర్‌ సెటప్, లైవ్‌ బ్యాండ్‌ ప్రదర్శనలు, ఫుడ్‌ స్టాల్స్, మొత్తం ఫెస్టివ్‌ అలంకరణతో ప్రాంగణం కనువిందు చేస్తుంది. 

ఈ బేగంపేట్‌లోని చిరాన్‌ ఫోర్ట్‌ క్లబ్‌లో ఎస్‌కే నవరాత్రి ఉత్సవ్‌ పేరిట ఈ నెల 22న రాత్రి 7గంటల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌ బిగ్గెస్ట్‌ దాండియా ఢమాల్‌గా నిర్వాహకులు అభివరి్ణస్తున్న ఈ ఈవెంట్‌లో డీజే డాన్‌ సింగ్‌ ఓ ఆకర్షణ. ఫుడ్, పానీయాలు, బహిరంగ వినోద వేదికలు.. సిద్ధం చేశారు. 

ఈమాదాపూర్‌లోని యూలో ఎరీనాలో నవరాత్రి దాండియా మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ డీజే మ్యూజిక్‌ అందిస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు. 

ఈ పీర్జాదిగూడలోని శ్రీ పలణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22న దాండియా మహోత్సవ్‌ సీజన్‌ 3 పేరిట నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా అలరించేలా తమ ఈవెంట్‌ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఈవెంట్‌ సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.

ఈసారి ఈ ఈవెంట్‌ను ఫ్లీ మార్కెట్‌తో మేళవించి అందిస్తున్నారు. బైరమల్‌గూడలోని ఎడుకంటి రామ్‌ రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే రస్‌ గర్భా వాల్యూమ్‌ 7 ఫ్లీ మార్కెట్‌ అండ్‌ ఎక్స్‌పో.. ఓ వైపు నవరాత్రి సంబరాల నృత్యాలతో పాటు షాపింగ్, ఫుడ్‌.. వంటివి మేళవిస్తోంది. మొత్తం 3 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవం ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ ఉప్పల్‌లోని శ్రీ పళణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22 రాత్రి 7గంటల నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకూ దాండియా సంబరాలు కొనసాగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సంబరాల్లో లైవ్‌ ఢోల్, డీజే షోస్, ఫుడ్‌ స్టాల్స్, సెలబ్రిటీల రాక.. వంటివి ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. 

ఈనోవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో సెలబ్రిటీ దాండియా నైట్స్‌ నిర్వహిస్తున్నారు. లైవ్‌ మ్యూజిక్, డీజేలు, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఫుడ్‌ స్టాల్స్‌ 
ఉంటాయి.  

నవరాత్రి ఉత్సవాలకు పేరొందిన నామ్‌ధారి గౌరవ్‌  ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నవరాత్రి ఉత్సవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.  

కొంపల్లిలోని జీబీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తరంగ్‌ నైట్స్‌ పేరిట దాండియా నైట్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కానుంది. గర్భా, దాండియా నృత్యాలు, ఫొటోగ్రఫీ అవకాశాలు.. ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ గర్భాను డిస్కో లైట్లు, ఆధునిక సంగీతంతో మిళితం చేసే డిస్కో దాండియా ఏఎమ్‌ఆర్‌ ప్లానెట్‌ మాల్‌లో జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యూజన్‌ ఈవెంట్‌ అని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. 

ఈ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షలో 11 రోజుల పాటు డోలా రే డోలా పేరిట నవరాత్రి దాండియా మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు. 

బుకింగ్స్‌.. ప్లానింగ్స్‌..

ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బుక్‌ చేసుకోవడం మంచిది. 

కుటుంబ సమేతంగా హాజరయ్యేవారు వేదికల సమాచారం, పార్కింగ్‌ సౌకర్యం, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలు ముందుగా సరిచూసుకుని ప్లాన్‌ చేయడం అవసరం. 

ఈ    నృత్యాలు చేసే అలవాటు ఉంటే అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి దగ్గరలోని 
ఈవెంట్‌ ఎంచుకుంటే బెటర్‌.

ఈ కొన్ని ఈవెంట్స్‌లో థీమ్‌ నైట్‌లు ఉంటాయి. కాబట్టి హాజరయ్యే ఈవెంట్‌కి సంబంధించి థీమ్‌/డ్రెస్‌ కోడ్‌ ఉంటే వాటి వివరాలు ముందుగా తెలుసుకోవడం అవసరం.

ప్రస్తుతం వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈవెంట్‌ రద్దయ్యే పరిస్థితుల్లో సందర్శకులకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో చెక్‌ చేసుకోవాలి.

టికెట్‌ కొనుగోలుకు బుక్‌ మై షో, హై యాపె, డిస్టిక్ట్, టిక్కెట్స్‌ 99 వంటి అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించడం మేలు. స్ట్రీట్‌ కాజ్‌ పేరిట 21న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దాండియా నైట్స్‌ జరుగనుంది. 

22 నుంచి అక్టోబర్‌ 2 వరకు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో ఢోలా రే ఢోలా పేరిట మెగా ఫెస్ట్‌. 

నాగోలు శ్రీరాంగార్డెన్స్‌లో 27, 28 తేదీల్లో దాండియా ఢోల్‌ భాజే పేరిట వేడుకలు. 

నగరంలోని టీబీఏ వేదికగా 22న నవరాత్రి బతుకమ్మ, దాండియా నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సోమాజీగూడ ది పార్క్‌ హోటల్‌లో 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు డిస్కో దాండియా. 

నాగోలు శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో 27న నాచో దాండియా పేరిట నవరాత్రి ఉత్సవాలు.  

బేగంపేట చిరాన్‌పోర్ట్‌లో 22 నుంచి అక్టోబర్‌ 2 వరకూ పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ్‌ పేరిట హైదరాబాద్‌ బిగ్గెస్ట్‌ దాండియా ధమాల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  

(చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Dussehra 2025
Dussehra Celebrations 2024
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

సంవత్సరాంతంలో..  సుస్వరాల హేల..!

సంవత్సరాంతంలో.. సుస్వరాల హేల..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.