Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

మహారణ్యానికి మహిళా బాస్‌

Family Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
01.jpg

అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్‌ పార్క్‌... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్‌.ఎస్‌ అధికారి సొనాలి ఘోష్‌ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్‌ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్‌ పరిచయం.

మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్‌ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్‌ పార్క్‌ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ భార్య మేరీ కర్జన్‌ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది.

వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్‌ పార్క్‌గా  రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్‌కు ఫీల్డ్‌ డైరెక్టర్‌గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్‌ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్‌ స్వీకరించనుంది.

అడవి అంటే ప్రేమ

సొనాలి ఘోష్‌ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్‌మెంట్‌ లా చదివింది. మానస్‌ నేషనల్‌ పార్క్‌లో పులులను ట్రాక్‌ చేసేందుకు రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్‌ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్‌.ఎస్‌. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్‌.ఎస్‌. 2000–2003 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్‌ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది.

స్త్రీలకు సవాలు

‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్‌.ఎస్‌.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్‌.ఎస్‌. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్‌ చేసుకోవడం.

అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు.

ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్‌.

ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
assam
Kaziranga National Park
women officer
ifs officer
Sonali
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

భార్య పరిహారం తీసుకొని వెళ్లిపోయింది.. జవాన్ తండ్రి ఆవేదన

భార్య పరిహారం తీసుకొని వెళ్లిపోయింది.. జవాన్ తండ్రి ఆవేదన

ఆధార్‌ కార్డులపై అస్సాం కీలక నిర్ణయం

ఆధార్‌ కార్డులపై అస్సాం కీలక నిర్ణయం

కూలిన ఐఏఎఫ్‌ విమానం.. ఐదుగురి మృతి

కూలిన ఐఏఎఫ్‌ విమానం.. ఐదుగురి మృతి

అస్సాం లో కుప్పకూలిన విమానం

అస్సాం లో కుప్పకూలిన విమానం

క్లిక్‌ @ కిక్‌

క్లిక్‌ @ కిక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.