Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
laxmipooja.jpg

పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి  ఒకటి.  ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.

చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు  లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి  దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు.  అమావాస్యనాడు  వచ్చే పండుగ అయినా జగమంతా  వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.

దీపావళి కథ
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి  జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే  రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో  విష్ణుమూర్తి  హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.

 


దీపావళి నాడు ఏం చేయాలి?
ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని  పండితులు చెబుతారు.

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా  శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే  తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం.  దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట  సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి,  మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి  అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని  నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. 

లక్ష్మీపూజ ఇలా 
మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి.   పిండి ముగ్గులతో  ముంగిళ్లను  తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి.  ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు.  లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది.  బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు,  పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.

దీపావళి సందడి మరింత
దీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి,  వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని  వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు. 

బొమ్మల కొలువు
బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద  కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా..  ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.

మతాబులు, చిచ్చుబుడ్లు
పూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా  మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు.  తక్కువ పొగ, శబ్దం వచ్చే  క్రాకర్స్‌కు ప్రాధాన్యత ఇ‍వ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి.  అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.

ఈ దీపావళి అందరికీ  ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి,  సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Diwali 2024
Lakshmi puja
Deepavali 2024
crackers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం

వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం

క్రేకర్స్‌తో డేంజరస్‌ స్టంట్‌..  కట్‌ చేస్తే!

క్రేకర్స్‌తో డేంజరస్‌ స్టంట్‌.. కట్‌ చేస్తే!

దీపావళి వేళ అపశ్రుతి.. 

దీపావళి వేళ అపశ్రుతి.. 

విషాదాలకు దూరంగా.. వెలుగులు పంచుదాం!

విషాదాలకు దూరంగా.. వెలుగులు పంచుదాం!

ఏపీలో సప్పగా దీపావళి.. ఒకపక్క వానలు.. మరోవైపు పేలుతున్న ధరలు

ఏపీలో సప్పగా దీపావళి.. ఒకపక్క వానలు.. మరోవైపు పేలుతున్న ధరలు

దీపావళి వేళ, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!

దీపావళి వేళ, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.