Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బిజీనా.. అయితే బీకేర్‌ఫుల్‌!

Family Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1214.jpg

నియంత్రణలేని కొనుగోళ్లతో వచ్చే వ్యాధి 

‘కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌’ నుంచి ఒనియోమానియా 

నగరవాసుల్లో కనిపిస్తోందంటున్న వైద్యులు 

విభిన్న రకాల మానసిక విపరీత ధోరణులకు అవకాశం 

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో నగరం

ఐరన్‌ మ్యాన్‌ 3 టీ షర్ట్‌ కావాలా.. ఆన్‌లైన్‌కు వెళ్లు, బ్లూటూత్‌ అవసరమా నెట్‌లో చూడు.. లంచ్‌కి వెజిటబుల్స్‌ లేవా జొమాటోలో ఆర్డర్‌ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్‌కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్‌ ట్రెండ్‌.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్‌.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.  

ఇటీవల జర్మనీలోని హన్నోవర్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు ‘కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్‌ ముల్లర్‌ అన్నారు. కాంప్రహెన్సివ్‌ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ టైమ్స్‌ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్‌లైన్‌ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‌‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్‌ ద్వారా నిర్ధారిస్తారు. 



తక్షణ ఉత్సాహం కోసం.. 
ఆన్‌లైన్‌ షాపింగ్‌ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్‌ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్‌ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ అంకుర్‌ సింగ్‌. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వ్యసనాన్ని కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌ దాటి  ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు.  ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.  



హార్మోన్లపై ప్రభావం.. 
కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్‌ను ఓపెన్‌ చేసిన మరుక్షణమే డోపమైన్‌ హోర్మోన్‌ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్‌ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్‌ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్‌ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్‌ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.

నష్టాలెన్నో.. 
సాధారణ వ్యక్తిగత షాపింగ్‌ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్‌ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు.  

 ఇలా వదులుకోవాలి.. 
⇒  ఆన్‌లైన్‌లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి.  
⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్‌ను సెట్‌ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను  నిర్ణయించుకోవాలి.  
⇒ ప్రచార ఈ మెయిల్స్‌ నుంచి సబ్‌స్క్రిప్షన్స్‌ తీసేయడం, ఫోన్‌ వగైరా డివైజ్‌ల నుంచి షాపింగ్‌ యాప్‌లను తగ్గించేయాలి.   
⇒  తరచూ షాపింగ్‌ వెబ్‌సైట్‌లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి.  
⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి.  

   మొదటి పది ఇవే.. 
నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్‌ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్‌ డివైజ్‌లు, ఫుట్‌వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్‌.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్‌ సైట్లలో.. స్నాప్‌ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్‌కార్డ్, షాప్‌క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్‌ ఎన్‌ యు.. 
వంటివి ఉన్నాయి.

నగరమా బీకేర్‌ఫుల్‌.. 
కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ వల్ల నగరవాసులు ఫిజికల్‌ స్టోర్‌లను విస్మరించి, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్‌ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్‌ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఆన్‌లైన్‌ షాపింగ్‌ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్‌కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు.  

కేవలం పుస్తకాలే.. 
తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్‌లైన్‌ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్‌ ఈ–షాపర్‌ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే కొంటున్నాను. 
– నికుల్‌గుప్తా

తక్కువ ధరలకు.. 
నగరంలోని షోరూమ్‌లు అందించే వాటికన్నా.. ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువ లేటెస్ట్‌ వెరైటీలు దొరుకుతాయి. బర్త్‌డే లేదా పార్టీ, ఫంక్షన్‌కు తగినవి, లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ గూడ్స్‌ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్‌లో దాదాపు 70 శాతం ఆన్‌లైన్‌ మీదే.       
– పూజానేతి  


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
buying
Disorder
Shopping mall
Addiction
problem
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రతి మొబైల్‌ ఫోన్‌ వర్చువల్‌ జూద గృహమే 

ప్రతి మొబైల్‌ ఫోన్‌ వర్చువల్‌ జూద గృహమే 

Hyderabad: కూకట్‌పల్లి షాపింగ్‌ మాల్‌లో ప్రమాదం

Hyderabad: కూకట్‌పల్లి షాపింగ్‌ మాల్‌లో ప్రమాదం

కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!

కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!

Hyd: షాపింగ్ మాల్‌కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు

Hyd: షాపింగ్ మాల్‌కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు

మంగళ గౌరి షాపింగ్ మాల్.. ప్రమాదానికి ముందు.. తర్వాత

మంగళ గౌరి షాపింగ్ మాల్.. ప్రమాదానికి ముందు.. తర్వాత

తగలబడ్డ మంగళ గౌరి షాపింగ్ మాల్

తగలబడ్డ మంగళ గౌరి షాపింగ్ మాల్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.