Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న మనసున్న అమ్మ

Family Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bindu-Ramakant-Ghatpande-04.jpg

ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! కొంతమంది తల్లులు తమ పిల్లల్లాగే... ఇతరులను సైతం ప్రేమగా చూసుకుంటుంటారు. కడుపున జన్మించక పోయినప్పటికీ ఆ తల్లి చూపే ప్రేమాభిమానాలకు అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బిందు రమాకాంత్‌ ఘట్‌ పాండే. బిందుని తన పిల్లలేగాక, వేలాదిమంది ‘అమ్మ’ అని అప్యాయంగా పిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెడుతూ ఎందరికో అమ్మగా మారింది బిందు రమాకాంత్‌ ఘట్‌పాండే. అంతమందికి అమ్మగా మారిన బిందు గురించి ఆమె మాటల్లోనే....



‘‘రాజస్థాన్‌లోని ఝుంఝునులో పుట్టాను. ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ప్రతి రెండేళ్లకోసారి నాన్నకు బదిలీలు జరిగేవి. దీంతో చాలా భాషలు పరిచయం అయ్యాయి. పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలు చక్కగా మాట్లాడగలను. నా పెళ్లి అయిన తరువాత మా ఆయనతో కలిసి భోపాల్‌లో స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి కోల్‌కతా ఐఐఎమ్‌ టాపర్‌. అమ్మాయి దుబాయ్‌లో రేడియో జాకీ. యాంకర్‌గా పనిచేస్తోంది. పిల్లల బాధ్యతలు తీరాక నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనిపించింది.

ఏం చేయాలా... అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీలో ‘గ్రాండ్‌ మదర్స్‌ కిచెన్‌’ గురించి చూశాను. అప్పుడే నాకు కూడా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చింది.  మా ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే ఇంట్లో భోజనం తయారు చేసి కారులో పెట్టుకుని రోడ్డుమీదకు ఆకలితో ఉన్న వారు కనిపిస్తే వారికి భోజనం పార్శిల్‌ ఇచ్చేదాన్ని. వాళ్లు తిన్న తరవాత చెప్పే కృతజ్ఞతలతో నాకు కడుపు నిండిపోయేది.  అలాగే ఉదయాన్నే పాతిక లీటర్ల గంజి తయారు చేసి వీధికుక్కలకు పోసేదాన్ని. ఆ తరువాత ‘ఉత్కర్షిణి’ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఈ ఉత్కర్షిణి వందలాది మంది ఆకలి తీరుస్తోంది. 

రోజుకో మెను...

కిచెన్‌లో ఎంతో పరిశుభ్రంగా భోజనం వండిస్తాను. తయారీ అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. రోజుకొక మెను పెడుతున్నాను. ఒక రోజు పప్పు, కూరలు, అన్నం పెడితే.. మరుసటిరోజు రాజ్మా, అన్నం, ఇంకోరోజు పూరీ, కూరలతో వడ్డిస్తున్నాం. పప్పు, అన్నం అయితే ప్లేటు ఐదు రూపాయలకు, రసగుల్లా, హల్వా పూరీ ఉన్న రోజు ప్లేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నాం. మా భోజనం తినేవారి సంఖ్య పెరగడం... ‘‘భోజనం బావుంది, కానీ స్వీట్‌ ఉంటే బావుంటుంది’’ అని కస్టమర్లు చెప్పడంతో తొలుత హల్వా పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు రసగుల్లా కూడా పెడుతున్నాం. 

ఆకలి తిరడానికి మాత్రమే...

ఉత్కర్షిణి కిచెన్‌లో తయారైన భోజనానికి ఎలాంటి నిబంధనలు లేవు. నిరుపేదల నుంచి ఎవరైనా తినవచ్చు. మా భోజనం తినేవారిలో పారిశుధ్య కార్మికులు, రిక్షా నడిపేవాళ్లు, నర్సులు, డాక్టర్లు, విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఆకలి వేసినా తిని వెళ్లాల్సిందే తప్ప.. ఇంటికి ప్యాక్‌ చేసి ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులు వేసుకునే ముందు ఏదైనా తినాలని చెప్పి సమోసా, బిస్కెట్లు తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీరు సైతం తినేలా మా కిచెన్‌ ఆహార పదార్థాలు అందిస్తోంది. 

అలా వందలమందికి..

నేను పెడుతోన్న భోజనానికి డిమాండ్‌ పెరగడంతో వంటవాళ్లను పెట్టుకుని వండించడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఆసుపత్రి, దానిపక్కన స్టూడెంట్‌ క్యాంపస్‌ ఉంది. అక్కడ భోజనం ప్లేటు ఐదు రూపాయలకు ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు వచ్చి తింటున్నారు. అలా నా దగ్గర భోజనం చేయడానికి వచ్చేవారు నన్ను ‘‘అమ్మ లేదా మా’’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా ఉత్కర్షిణి కిచెన్‌ కుటుంబం రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే త్వరలో భోపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా నా సేవలను విస్తరించబోతున్నాను. మరింత మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం’’అని చెప్పింది బిందు రమాకాంత్‌ ఘట్‌పాండే.  

                         

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
food
serving
Women Power
poor people
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

కొత్త కార్డులు హుళ క్కే!

కొత్త కార్డులు హుళ క్కే!

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌  21 రోజుల్లోనే..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌ 21 రోజుల్లోనే..

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..

ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.