Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. నరక బాధలపై నారి సారించి...
ADVERTISEMENT

నరక బాధలపై నారి సారించి...

Family Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 04:27 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
naraka.jpg

ఐదు రోజుల దీపావళి పండుగలో రెండోరోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు... దీపావళికి ముందురోజు జరుపుకునే ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి, స్త్రీ శక్తికి నిదర్శనం. లోక కంటకుడైన నరకాసురుడి పీడ విరగడైనందుకు ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఒక గొప్ప పురాణ గాథ, విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి.

నరక చతుర్దశిలో సత్యభామ పాత్ర అత్యంత విశిష్టమైనది కీలకమైనది. ఎందుకంటే ఈ పండుగ సత్యభామ శౌర్యానికి, ధైర్యానికి, స్త్రీ శక్తికి దక్కిన గొప్ప గౌరవం అని చెప్పాల్సి ఉంటుంది.

భాగవత పురాణం ప్రకారం, భూదేవి కుమారుడైన నరకాసురుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి చావులేకుండా వరం కోరతాడు. బ్రహ్మ అది అసాధ్యమని అనడంతో  తన తల్లి చేతిలో తప్ప మరెవరి వల్లా మరణం రాకూడదని కోరతాడు. సరేనంటాడు బ్రహ్మ. ఆ విధంగా బ్రహ్మ నుంచి అజేయమైన వరాలను పొందిన నరకుడు, ప్రాగ్జ్యోతిషపుర రాజధానిగా ముల్లోకాలను పీడించేవాడు. సాధువులను, మునులను వేధించడమే కాకుండా, క్షుద్రపూజలలో బలిచ్చేందుకు గానూ 16 వేల వంద మంది కన్యలను బంధించాడు. దేవమాత అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్నీ కూడా దొంగిలించాడు. 

ప్రజలందరూ నరకుడి ఆగడాల గురించి శ్రీకృష్ణుడికి మొరపెట్టుకోవడంతో ఇక ఉపేక్షించేది లేదని కృష్ణుడు నరకాసురుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని పట్టుబట్టడంతో శ్రీ కృష్ణుడు ఆమెను తన గరుడ వాహనంపై ఎక్కించుకుని ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరాడు.

ప్రాగ్జ్యోతిషపురం చుట్టూ నరకాసురుడు దుర్భేద్యమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేశాడు. అలాగే మురాసురుడు అనే ఐదు తలల భయంకరమైన రాక్షసుడు దానికి కాపలాగా ఉన్నాడు. శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ  వలయాలను ఛేదించాడు. అడ్డుపడ్డ మురాసురుడిని, అతని కుమారులను సంహరించాడు. అది తెలిసిన నరకాసురుడు క్రోధంతో తన అపార సైన్యంతో, గజదళంతో స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. కృష్ణుడు నరకుడి సైన్యాన్ని క్షణాల్లో తుత్తునియలు చేశాడు.

యుద్ధం సాగుతుండగా నరకాసురుడు శ్రీ కృష్ణుడిపై ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు కృష్ణుడు స్పృహ కోల్పోవడంతో సత్యభామ తీవ్ర ఆగ్రహంతో విల్లంబులు చేతబూని నరకాసురుడిపై లంఘించి పోరాడుతూ నరకుడి సైన్యాన్ని చీల్చి చెండాడింది. చివరకు సత్యభామ సంధించిన తీక్షణమైన బాణాల ధాటికి తాళలేక నరకాసురుడు నేలకూలాడు.

నరకుడు మరణించే సమయంలో తన తల్లిని గుర్తించి, తన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. తన మరణదినాన్ని ప్రజలందరూ శాశ్వతంగా గుర్తుంచుకునేలా వరం ఇవ్వమని కోరాడు.

అందుకే నరకుడు మరణించిన రోజును నరక చతుర్దశి అంటారు. ఆ దుష్టుడి పీడ ఆ రోజున వదిలిపోయిన ఆనందంలో మరుసటి రోజు ప్రజలంతా దివ్వెలు (దీపాలు) వెలిగించి, బాణాసంచా కాల్చి దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ విధంగా నరకుడి పేరు నిలిచిపోయింది.

నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని, నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగమ్మ కొలువై ఉంటారని శాస్త్రోక్తి. ఈ స్నానం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. స్నానానంతరం దేవుడి గదిలో పూజ చేసి, ఇంటి ముంగిట ముగ్గులు వేయాలి.
సాయంత్రం వేళ యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడానికి, అపమృత్యు దోషాలు తొలగడానికి ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగిస్తారు. దీన్నే ‘యమ దీపం’ అంటారు. ఈ యమదీపాన్ని సాధారణంగా ఇంటి యజమాని లేదా యజమానురాలు మాత్రమే వెలిగించడం ఆచారం. ఇక సాయంత్రం ఇల్లంతా ప్రమిదలతో అలంకరించి, లక్ష్మీపూజకు నాంది పలుకుతూ బాణసంచా కాలుస్తారు. ఈ పండుగ మనలోని అజ్ఞానాన్ని, దుర్గుణాలను (రాక్షస ప్రవృత్తిని) వదిలి, జ్ఞాన మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఇస్తుంది.
 
– డి.వి.ఆర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Diwali
Naraka Chaturdashi
Women Power
Narakasura
Satyabhama
Lord sri krishna
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

దేశ రక్షణలోనే దీపావళి వేడుకలు.. సరిహద్దులో జవాన్ల సందడి

దేశ రక్షణలోనే దీపావళి వేడుకలు.. సరిహద్దులో జవాన్ల సందడి

హైదరాబాద్ లో దీపావళి విషాదం.. టపాసులతో 50 మందికి కంటి గాయాలు

హైదరాబాద్ లో దీపావళి విషాదం.. టపాసులతో 50 మందికి కంటి గాయాలు

Allu Arjun: ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ దీపావళి సెలబ్రేషన్స్..

Allu Arjun: ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ దీపావళి సెలబ్రేషన్స్..

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి సంబరాలు..

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి సంబరాలు..

నేడు బ్యాంకులకు సెలవు.. ఈ 7 రాష్ట్రాల్లో క్లోజ్!

నేడు బ్యాంకులకు సెలవు.. ఈ 7 రాష్ట్రాల్లో క్లోజ్!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft