Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. లెక్కలు, చిక్కులు
ADVERTISEMENT 

లెక్కలు, చిక్కులు

Editorial Sakshi User Sakshi Sakshi Time Dec 9, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
human.jpg

లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు. 

ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు. 

మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం. 

ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం. 

పెరిగిన జనాభాను బట్టి లోక్‌ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం. 

రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్‌’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్‌ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది. 

మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే,  అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం. 

పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్‌ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్‌ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు. 

యూరప్‌ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది. 

అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు. 

విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్‌ అనుభవాన్ని గమనించిన థామస్‌ రాబర్ట్‌ మాల్తస్‌ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి!    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Population Growth
United Nations
Europe
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

యుద్ధం ముగిసింది 

యుద్ధం ముగిసింది 

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు

సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు

యుద్ధభూమిలో... జెండర్‌ పోరాటం

యుద్ధభూమిలో... జెండర్‌ పోరాటం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.