Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇన్‌స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!

Business Sakshi User Sakshi Sakshi Time Jan 28, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
instagram.jpg

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్‌ఫాంలలో కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్‌ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్‌తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్‌లను పరీక్షించనున్నట్లు మెటా టెక్‌క్రంచ్‌కు ధ్రువీకరించింది.

మెటా ప్రకారం.. ప్రతి యాప్‌కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్‌కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్‌ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ఈ సబ్‌స్క్రిప్షన్‌లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్‌ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్‌ను మెటా యాప్‌లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మానస్ ఏఐ షార్ట్‌కట్‌ను జోడించే పనిలో మెటా ఉంది.

అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్‌ను ఫ్రీమియం మోడల్‌కు మార్చే యోచనలో మెటా ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్‌కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.

కాగా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్‌ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Instagram
WhatsApp
Facebook
Meta
Paid
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

మెటా కలలు కల్లలైన వేళ

మెటా కలలు కల్లలైన వేళ

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్‌బుక్‌ వీడియో

‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్‌బుక్‌ వీడియో

 దేశాన్ని ఏలే పాలకులు కావాలి

దేశాన్ని ఏలే పాలకులు కావాలి

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.