Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT

సుప్రీం కోర్టు తీర్పు.. విద్యుత్‌ రేట్లు పెరుగుతాయా?

Business Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mining01.jpg

భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో మైనింగ్‌ కంపెనీలపై దాదాపు రూ.2 లక్షల భారం పడవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని ఫిమి విచారం వ్యక్తం చేస్తుంది. బొగ్గుపైనే ఆధారపడి విద్యుత్‌ తయారు చేసుకునే రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ‍ప్రిల్‌ 1, 2005 నుంచి మైనింగ్‌ కంపెనీలు రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖనిజాలు, గనులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కంపెనీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం చెందుతాయి. బొగ్గు ఎక్కువ వెలికితీసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేది ఆ రాష్ట్రాలే. అయితే బొగ్గునే ఆధారంగా చేసుకుని విద్యుత్‌ తయారు చేసుకునే రాష్ట్రాలకు కోర్టు తీర్పుతో నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీలు బొగ్గు ధరను పెంచే ప్రమాదం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాల ట్రాన్స్‌​కోలు విద్యుత్‌ యూనిట్‌ ధరను పెంచుతాయి. అంతిమంగా సామాన్య ప్రజలపై భారం పడుతుంది. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.

ఇదీ చదవండి: రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్‌ ఆమోదం

ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో గృహావరాలకు సైతం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పార్టీలు హామీ ఇచ్చాయి. ఆ పార్టీలే అధికారంలోకి రావడంతో విద్యుత్‌ సరఫరా భారంగా మారుతుంది. దానికితోడు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపబోతుండడంతో విద్యుత్‌ తయారీకి అవసరమయ్యే బొగ్గును చౌకగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి. దేశీయ బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువగా వెలువడి సామర్థ్యం తగ్గుతుందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించాయి. చైనా వంటి దేశాల్లోని బొగ్గుతో తక్కువ బూడిద వస్తుండడంతో దాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
power
Coal mining
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

గుప్పెళ్లతో మందులొద్దు.. యోగాతో రోగాలకు చెక్!

గుప్పెళ్లతో మందులొద్దు.. యోగాతో రోగాలకు చెక్!

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.