Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కుంభమేళాలో స్టీవ్‌ జాబ్స్‌ భార్యకు అస్వస్థత

Business Sakshi User Sakshi Sakshi Time Jan 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
steve-jobs-wife.jpg

దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు హాజరయ్యారు. అయితే.. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి 'కైలాసనంద గిరి మహారాజ్' వెల్లడించారు.

లారెన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని కైలాసనంద గిరి మహారాజ్ చెప్పారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. అంతే కాకుండా లారెన్ చాలా సాదాసీదాగా ఉంది, పూజా సమయంలో కూడా మాతో పాటు ఉండేవారని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు లారెన్ పావెల్ జాబ్స్ హాజరై.. ఆమె పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి, ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మన దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.

లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.

మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నానానికి కనీసం 3-4 కోట్ల మంది ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.

మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.

రూ.2 లక్షల కోట్ల ఆదాయం
ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.

2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
steve jobs
Maha Kumbh Mela
Maha Kumbh Mela 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారతీయ వారసత్వ విశ్వరూపం 

భారతీయ వారసత్వ విశ్వరూపం 

ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!

ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!

‘కుంబ్‌’ వ్యర్థమా?.. మరి హాలోవిన్‌?’

‘కుంబ్‌’ వ్యర్థమా?.. మరి హాలోవిన్‌?’

'స్వీయ నిబద్ధతే' జీవిత సారం

'స్వీయ నిబద్ధతే' జీవిత సారం

Delhi Baba: ‘స్టీవ్‌ జాబ్స్‌, ఒబామా.. నా ముందు దిగదుడుపే’.. సరికొత్త వాదన

Delhi Baba: ‘స్టీవ్‌ జాబ్స్‌, ఒబామా.. నా ముందు దిగదుడుపే’.. సరికొత్త వాదన

తొక్కిసలాటపై రాజకీయ దుమారం.. సీఎం నోట కుంభమేళా మాట

తొక్కిసలాటపై రాజకీయ దుమారం.. సీఎం నోట కుంభమేళా మాట

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.