Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!

Business Sakshi User Sakshi Sakshi Time Aug 28, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Neeraj-Chopra-10.jpg

టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. 

నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం.

రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. 

రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ.

మహీంద్రా థార్ & XUV700.. 

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది.

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. 

భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌లతో వస్తుంది.

ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!

హార్లే డేవిడ్‌సన్‌ 1200 రోడ్‌స్టర్‌ (Harley-Davidson 1200 Roadster)..

బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్‌సన్‌ 1200 రోడ్‌స్టర్‌ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ.

ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన 

బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F)..

ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Neeraj Chopra
bikes
cars
automobiles
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..

భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..

హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

నీరజ్‌కు నాలుగో స్థానం

నీరజ్‌కు నాలుగో స్థానం

నీరజ్‌ సిద్ధం...

నీరజ్‌ సిద్ధం...

దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం!

దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం!

కారును ట్రైన్‌లో ఎలా పంపాలంటే..?

కారును ట్రైన్‌లో ఎలా పంపాలంటే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.