Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు

Business Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
man01.jpg

ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్‌ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్‌ సింగ్‌. ఆర్థికశాఖలో ఎకనామిక్‌ అడ్వైజర్‌గా పనిచేసినా, ఆర్‌బీఐ గవర్నర్‌(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

ప్రధాన ఆర్థిక సలహాదారుగా..

1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.

వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.

పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.

ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.

ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.

ఆర్‌బీఐ గవర్నర్‌గా..

1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.

బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.

అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్‌మెంట్‌: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.

ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.

రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.

ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్‌బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్‌ ఎలా చేయాలి?

ఆర్థిక మంత్రిగా..

1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.

సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.

ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.

విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.

పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Manmohan Singh
Structural reforms
Reforms
India economy
Indian economy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్‌!

విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్‌!

భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

అసలు సమస్య...రూపాయి పతనం కాదు

అసలు సమస్య...రూపాయి పతనం కాదు

పింఛను రంగంలో ఎఫ్‌డీఐ పెంపు!

పింఛను రంగంలో ఎఫ్‌డీఐ పెంపు!

చైనాలో రివర్స్ మైగ్రేషన్..

చైనాలో రివర్స్ మైగ్రేషన్..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.