Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కళను దొంగలిస్తున్న ఏఐ

Business Sakshi User Sakshi Sakshi Time Apr 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aii.jpg

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ జనరేటివ్‌ ఆర్ట్‌ జీబ్లీ టూల్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఒక సంస్థ ప్రజల్లో ఆదరణ పొందే సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే పోటీ కంపెనీలు కూడా తమ యూజర్లను కాపాడుకునేందుకు ఎలాగైనా అదే తరహా, అంతకంటే మెరుగైన సేవలు అందించేందుకు పావులు కదుపుతాయి. అందులో భాగంగానే గూగుల్‌, గ్రోక్‌ఏఐ వంటి సంస్థలు కూడా ఏఐ ఆర్ట్‌ జనరేషన్‌ ఇమేజ్‌ను అందిస్తున్నాయి. కానీ ఇది నిజమైన కళాకారుల కళలను అనుసరిస్తూ, కాపీ రైట్‌ ఆందోళలనలకు దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాపీరైట్ ఆందోళనలు

ఏఐ నమూనాలు శిక్షణ కోసం చాలాసార్లు కాపీరైట్ చేసిన కంటెంట్‌ డేటాసెట్లపై ఆధారపడతాయి. స్పష్టమైన అనుమతి లేకుండా ఇటువంటి కంటెంట్‌ను ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. దాంతో కృత్రిమ మేధ సృష్టించిన ఆర్ట్‌ కంటెంట్‌ ఓనర్‌షిప్‌ ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంటుంది. ఏఐ ఆర్ట్ జనరేటర్లు నిర్దిష్ట కళాత్మక శైలులను అనుకరిస్తాయి. ఇది మానవ కళాకారుల ఒరిజినాలిటీని బలహీనపరుస్తుంది. ఏఐ ఆర్ట్‌ కంటెంట్‌ మానవ కళాకారుల పనిని తగ్గిస్తుంది. ఇది వారిని ఆర్థిక ఊబిలోకి నెట్టివేస్తుందనే అభిప్రాయాలున్నాయి.

దుర్వినియోగం

ఏఐ జనరేటెడ్ ఆర్ట్ ఒక కళాకారుడి శైలిని ప్రతిబింబించగలదేమో కానీ తన విలువలను, ఉద్దేశాలను తెలుపలేదు. ఉదాహరణకు, హయావో మియాజాకి(శాంతికి సంబంధించిన కళాకండాలు వేసే చిత్రకారుడు) వంటి కళాకారుడి శైలికి విరుద్ధంగా సైనిక, హింసాత్మక చిత్రాలను ఏఐ సృష్టిస్తోంది.

భావోద్వేగాలు

కృత్రిమ మేధ చారిత్రక విషాదాలు లేదా సాంస్కృతిక సంఘటనలు వంటి సున్నితమైన అంశాలను చిత్రాల రూపంలో స్టైలిష్‌గా చూపుతుంది. కొన్నిసార్లు విచిత్రమైన రీతిలో వాటిని ప్రదర్శిస్తుంది. ఇది ఆయా సంఘటనల వల్ల ప్రభావితమైన వారికి ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

ఇదీ చదవండి: పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..

ప్రముఖ కంపెనీల ఏఐ ఆర్ట్‌ జనరేటివ్‌ ఇమేజింగ్‌ వ్యవస్థలు సృష్టిస్తున్న కంటెంట్‌కు పరిమితులుండాలని కొందరు అంటున్నారు. ఎదుటివారి మనోభావాలు, ఆర్థిక, సామాజిక స్థితి దిగజారకుండా ఉండేంతవరకు పరిమితులకు లోబడి ఏఐ కంటెంట్‌ ఉండే సరిపోతుందని తెలుపుతున్నారు. అందుకు సమగ్ర విధానాలు రూపొందించడానికి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AI
art
Ghibli
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

టెకీలు.. AI వాడితే సేఫ్‌.. లేకుంటే లేఆఫ్‌!

టెకీలు.. AI వాడితే సేఫ్‌.. లేకుంటే లేఆఫ్‌!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.