Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

డెలివరీ పార్ట్‌నర్స్‌కు శీతల పానీయాలు

Business Sakshi User Sakshi Sakshi Time Jun 10, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
HEATWAVE.jpg

సేద తీరేందుకు తగిన ఏర్పాట్లు 

ఎండల దృష్ట్యా కంపెనీల నిర్ణయం 

న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్‌నర్స్‌ సేద తీరేందుకు ఫుడ్‌ డెలివరీ, ఈ–కామర్స్‌ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్‌నర్స్‌ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్‌ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్‌ ఏర్పాట్లు ఉంటాయి.

 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్‌నర్స్‌కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్‌ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్‌ స్లీవ్, డ్రై ఫిట్‌ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్‌ రంజన్‌ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్‌ వేదికగా విన్నవించింది. 

బీమా కవరేజ్‌ సైతం.. 
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ 900లకుపైగా రీచార్జ్‌ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్‌ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్‌ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ తన యాప్‌లో ఎస్‌వోఎస్‌ సపోర్ట్‌ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్‌నర్స్‌ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్‌ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్‌ సీఈవో అల్బీందర్‌ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్‌ డెలివరీ పార్ట్‌నర్స్‌ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్‌ పేషెంట్‌ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్‌ ఆఫర్‌ చేస్తోంది. గ్లూకోస్‌ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఫెసిలిటీస్‌ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
delivery boy
food
E-commerce companies
rest
points
Zomato
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌  21 రోజుల్లోనే..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌ 21 రోజుల్లోనే..

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

లిక్విడ్‌ నైట్రోజన్‌తో కూడిన ఆహారం సురక్షితమేనా?

లిక్విడ్‌ నైట్రోజన్‌తో కూడిన ఆహారం సురక్షితమేనా?

మెటాతో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం

మెటాతో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.