Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

80 గంటల పని.. అమెజాన్‌ అనుభవాలు చెప్పిన సీఈవో!

Business Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
amazon-work_0.jpg

విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్‌ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.

డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.

అమెజాన్‌లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.

అమెజాన్‌లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.

ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్‌ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్‌లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Amazon
Jeff Bezos
AI
CEO
USA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.