Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బేరం కుదిరితేనే బిల్లు!
ADVERTISEMENT 

బేరం కుదిరితేనే బిల్లు!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
houses.jpg

సాక్షి, అమరావతి: అక్రమార్జనే పరమావధిగా ప్రభుత్వ పెద్దలు, చినబాబు, పలువురు మంత్రులు, కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. లాభాపేక్ష లేకుండా పేదలకు పక్కా ఇళ్లను నిరి్మంచే ఏజెన్సీలను సై­తం వదలడం లేదు. దీంతో గత వైఎస్‌ జగన్‌ హయాంలో తలపెట్టిన ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. చంద్ర­బాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టీడీపీ కూటమి నేతలు ఆదాయార్జన మార్గాలపై కన్నేశారు. ఇందులో భాగంగా జగనన్న కాలనీల్లోని ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణాలపై వాలిపోయారు. వాటిని నిరి్మంచే ఏజెన్సీల నుంచి అందినంత వరకూ దండుకునేందుకు ముందుగా వాటిపై ఆరోపణలు చేశారు. దీంతో విజిలెన్స్‌ విచారణ పేరిట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు ఆపేశారు. 

ఫలితంగా రూ.80 కోట్లకు పైనే ఏజెన్సీలకు నిధులు ఆగిపోయాయి. ఇక ఈ బిల్లుల విడుదలకు ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు రాయ‘బేరాలు’ మొదలుపెట్టారు. వీరు డిమాండ్‌ చేసినంత కమీషన్లు ఇవ్వడానికి సిద్ధమైన వారి బిల్లులే విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, గుంటూరు సహా పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆప్షన్‌–3 ఇళ్ల పెండింగ్‌ బిల్లుల మంజూరుకు ఏకంగా 20 శాతానికి పైగా కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.  

మంత్రి సారథి సిఫార్సులు.. 
నిజానికి.. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ దశల వారీగా బిల్లులు చెల్లిస్తుంది. ఆప్షన్‌–3కు సంబంధించి లబ్ధిదారులు, నిర్మాణ ఏజెన్సీ, బ్యాంకు కలిపి త్రైపాక్షిక (ట్రై పార్టీ బ్యాంకు) అకౌంట్లు తెరిచారు. పునాది, లెంటెల్, శ్లాబ్‌ ఇలా వివిధ దశల నిర్మాణం ఆధారంగా స్థానిక గృహ నిర్మాణ సిబ్బంది బిల్లు మంజూరుకు ప్రతిపాదిస్తారు. వివిధ దశల్లో స్రూ్కటినీ అనంతరం ఆటోమేటిక్‌గా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమకావాలి. గత ప్రభుత్వంలో ఇదే విధానం కొనసాగింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాగానే కొత్త సంస్కృతికి తెరలేపారు. 

ఏజెన్సీల నిర్వాహకులు నాయకులను ప్రసన్నం చేసుకుని మంత్రిని కలిస్తే ఆయన బిల్లుల మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు. ఇలా తనను కలిసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశిస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్‌లైన్‌లో నిష్పక్షపాతంగా జరగాల్సిన బిల్లింగ్‌ ప్రక్రియకు కూడా ఓ మంత్రి సిఫార్సు చేయడం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కమీషన్ల బాగోతం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.  

బెదిరించడమే ఆ సీనియర్‌ ఎమ్మెల్యే పని.. 
మరోవైపు.. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేస్తున్న వారిని టార్గెట్‌ చేసి, బెదిరించి డబ్బు వసూలుచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పరంపరలో భాగంగా ఆ జిల్లాలో ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలపై అనేక ఆరోపణలు చేసి, చివరకు వాటితో డీల్‌ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అలాగే, ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో టీడీపీ నాయకుడికి గృహ నిర్మాణ శాఖలో నామినేటెడ్‌ పోస్టుని కట్టబెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కూడా ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు, ఇతర జిల్లాల్లోని ఏజెన్సీల యజమానులతో ఆయన డీల్‌ కుదుర్చుకుని వారికి బిల్లులు మంజూరుచేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu government
TDP
Houses construction
alliance leaders
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.