సాక్షి, విజయవాడ: విద్యాభవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ విద్యాభవన్ ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున యూటీఎఫ్ లీడర్లు విద్యాభవన్ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు దురుసుగా ప్రవర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. యూటీఎఫ్ నేతలను అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT