Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. భావిపౌరులు.. వ్యసనాలకు బానిసలు
ADVERTISEMENT 

భావిపౌరులు.. వ్యసనాలకు బానిసలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Students.jpg

కూడేరు హైస్కూల్లో 15 ఏళ్లలోపు విద్యార్థులు బీడీ,సిగరెట్, గుట్కాలకు బానిస 

తల్లిదండ్రుల గారాభం తెస్తోంది చేటు 

అడిగినంత డబ్బులిస్తున్న తల్లిదండ్రులు 

పెడదోవ పడుతున్న బాల్యం  

భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకుంటున్న వైనం  

అడ్డాగా మారిన కంపచెట్లు:  కూడేరు హైస్కూల్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మాణానికి రూ.లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి ప్రధానోపాధ్యాయుడు పనులు సక్రమంగా చేయించకపోవడంతో బాలుర మరుగుదొడ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. బాలికలకు 5 మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో మగపిల్లలు మలవిర్జనకు పాఠశాలకు దగ్గరలో జాఫర్‌ పిండి మిషన్‌ ముందు ఖాళీ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్ల మాటుకు వెళ్తున్నారు.

ఈ కంప చెట్లే పిల్లలు చెడు మార్గంలో వెళ్లడానికి అడ్డాగా మారాయి. మూత్ర విసర్జనకంటూ అక్కడికి వెళ్లడం.. బీడీలు, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకోవడం అధికమైంది. పిల్లలు బయటకు వెళుతున్నా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కూడేరు: బాగా చదివి భావి పౌరులుగా ఎదగాల్సిన ఆ విద్యార్థులు బంగారు బాల్యాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతంగా ఎదగాల్సిన వారి జీవితాలు బీడీ, సిగరెట్, గుట్కాలాంటి వ్యసనాలతో ‘పొగ’ చూరుతున్నాయి. పదిహేనేళ్లలోళ్లలోపే ‘మత్తు’కు అలవాటు పడి భవిష్యత్‌ చిత్తు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల గారాభం.. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో తోటి విద్యార్థులు తోడై పెడదోవ పడుతున్నారు.

చిరుప్రాయం నుంచే క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన పిల్లలు.. అవసరానికి మించి డబ్బులిస్తుండడంతో జల్సాలకు అలవాటు పడుతున్నారు. చెడుమార్గంలో వెళ్లి వారి ఆశయాలు, తల్లిదండ్రుల ఆశలను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరానికి పొరుగున ఉండే కూడేరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 454 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలువురు బాలురులు బీడీ సిగరెట్, గుట్కా, కల్లుకు బానిసవుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు 9,10వ తరగతి పిల్లల్లో కొందరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. నెల రోజులు నుంచి వారిని చూసి 6, 7,8వ తరగతి పిల్లలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. తొలుత రూపాయి పెట్టి చుట్ట బీడీ తాగడం మొదలెట్టి .. తర్వాత రూ.10ల విల్స్, రూ.12 పెట్టి గోల్డ్‌ సిగరెట్లకు అలవాటు పడ్డారు. తాజాగా వారి ధ్యాస గుట్కా వైపు మళ్లింది. రూ.10, రూ.20 పెట్టి విమల్, చైనీ ఖైనీ వంటి గుట్కాలను వాడుతున్నారు. 

వ్యసనాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.. 
కొందరు పిల్లలకు చదువుపై ధ్యాస లేదు. టీవీలు, సినిమాలు, సెల్‌ఫోన్‌లో యుట్యూబ్‌లో బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కాలు వేసుకోవడం ఫ్యాషన్‌గా తీసుకొని వీరు బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుట్కా వేసుకోవడంతో నోటి కేన్సర్‌ వస్తుందన్న విషయం తెలియక డబ్బు పెట్టి జబ్బులు కొని  తెచ్చుకుంటున్నారు.  

పిల్లల భవిష్యత్‌ నాశనం
పెద్దవారే బీడీలు, సిగరెట్లు తాగి, గుట్కా వేసుకోవడంతో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మరీ చిన్నపిల్లలు వీటికి బానిస కావడం దారుణం. అడ్డుకట్ట వేయకపోతే చదువుపై శ్రద్ధ చూపకపోగా మరింత వ్యసన పరులై చేతులారా భవిష్యత్‌ నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బులివ్వడం మంచిది కాదు. – లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారి, కూడేరు  

నిఘా ఉంచుతాం..
కొందరు పిల్లలు బీడీలు, సిగరెట్లు తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరగతి గదుల్లో ఉండకుండా బయట తిరుతున్న పిల్లలపై నిఘా ఉంచాం. అల్లరి, చిల్లరిగా తిరిగే పిల్లల విషయాన్ని వారి తల్లిదండ్రులను పిలిపించి తెలియజేశాం. మగపిల్లలకు మరుగుదొడ్లు లేకపోవడం సమస్యగా మారింది. మలమూత్ర విసర్జనకంటూ పిల్లలు బయటకు వెళుతున్నారు. ధూమపానం, గుట్కాకు అలవాటు పడిన పిల్లలపై తోటి పిల్లలతో నిఘా పెట్టిస్తాం.   –  శ్రీదేవి, హెచ్‌ఎం, కూడేరు హైస్కూల్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
school students
tobacco
Anantapur
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.