Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?
ADVERTISEMENT 

రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2024 Sakshi Read Time Read Time: 6 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NIRUDYOGA-BRUTHI.jpg

రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల ఎదురుచూపులు 

జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపెడాశలు

ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం 

ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న చిన్న ప్రైవేట్‌ ఉద్యోగాలకు గుడ్‌ బై 

భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట 

ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా భృతిపై నోరు మెదపని సర్కారు.. యువత ఆందోళన 

భృతి ఎప్పుడిస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్‌ 

గతంలోనూ రూ.2 వేల భృతి ఇస్తా నంటూ మాట తప్పిన చంద్రబాబు  

2014–19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే 

2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6.38 లక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వాలని కోరుతోంది. అధికారంలోకి వచ్చి నెల దాటినా, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌లోని 1.60 కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్‌ చేస్తోంది. 

2014లో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయ వలలో చిక్కుకుని ఐదేళ్లూ నిరుద్యోగ యువత విలవిల్లాడిపోయారు. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. 

గతంలో మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. మళ్లీ బూటకపు హామీలతోనే ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన రాజకీయ జీవితంలో చెప్పింది చెప్పినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని.. లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురు చూస్తోంది. చాలామంది చిన్నా చితకా పనులు వదిలేసి.. స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్ధిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.   

సూపర్‌ సిక్స్‌ టాప్‌లో భృతి 
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. 
 


మెగా డీఎస్సీ పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16 వేల పోస్టుల భర్తీ కాస్తా నత్త నడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీపడే వారు లక్షల్లో ఉన్నారు. 

వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి.. ఆర్ధిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్లలో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

కోచింగ్‌కు రూ.లక్షల్లో ఫీజులు  
ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్ధిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్‌ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్‌ కోసమే రూ.లక్షలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో రూ.50 వేల వరకు ఖర్చువుతోంది. గ్రూప్‌–2కు అయితే రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. 

డీఎస్సీ, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్‌ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు, ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.  


గతంలో చేసినట్టే చేస్తారా? 
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం.. పాలనను ప్రారంభించడంతో పాటు.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలెట్టారు. కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. 

నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించ లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఐదేళ్లు పబ్బం గడుపుకుని మొండి చెయ్యి చూపించారు. అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఊదరగొట్టి నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతికి 2017–18లో రూ.500 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ, రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. 

అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలిక పెట్టారు. 

కొన్ని చోట్ల కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్న వారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ.. 1.62 లక్షల మందికే ఇస్తామని.. దీనికి ఈ–కేవైసీ లింక్‌ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. 

గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అనుభవం దృష్ట్యా ఈ సారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.   

వయో పరిమితిని గుర్తించాలి.. 
రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లు, రిజర్వడ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, విజయం కూడా సాధిస్తున్నారు. 

ఏపీపీఎస్సీ వయో పరిమితి ఇలా ఉంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 22–35 ఏళ్ల వయసు్కలు మాత్రమే భృతికి అర్హులని ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు. ఇంటర్‌ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతారు. డిప్లొమా చేసిన వారి వయసు కూడా 19 ఏళ్ల లోపుగానే ఉంటుంది. వీళ్లందరిని కూడా గతంలో గుర్తించక పోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 

దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టినట్టు మరే నాయకుడూ చేసి ఉండరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. 

రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్‌ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం.  

నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వాలి 
జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలి. ఒక్క నెల నోటిఫికేషన్‌ ఆలస్యమైనా లక్ష­లాది మంది నిరుద్యోగులు వయో పరిమితి దా­టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. 

యువగళంలో లోకేశ్‌.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీడీపీ 2014–19లో నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగుల ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది.  
    – వై.రామచంద్ర, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు 
 
తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే  
గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్‌ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్ధిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది.  ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ భృతి కనీసం 40 ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే.   
    – సమయం హేమంత్‌ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు 

నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు 
ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్‌ తీసుకుంటారా? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది.    
 – మేడూరి నవీన్‌ దాస్, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లా కాలేజ్, విశాఖపట్నం 
 
జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు? 
ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి. జాబ్‌ క్యాలెండ్‌ కంటే ముందు పాత నోటిఫికేషన్లను పూర్తి చేయాలి. ఈలోగా నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెలా రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలి. దీని స్పష్టమైన తేదీలను ప్రకటించాలి.
    – కొనిగపాగ అనిల్‌ బాబు, విజయవాడ

వీటి సంగతేంటి బాబూ?
వైఎస్సార్‌ రైతు భరోసా
ఈ పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున ఏటా 51,13,249 మంది రైతులకు రూ.6,857.63 కోట్లు.. ఐదేళ్లలో రూ.34,288.17 కోట్లు ఇచ్చింది. కూటమి హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పుడు ఇస్తారు?

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా  
గత ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసాను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి, ఏటా సగటున 1,07,602 మందికి రూ.107.60 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.538.01 కోట్లు ఇచ్చింది. మీరు ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారు?

వైఎస్సార్‌ సున్నా వడ్డీ
ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఏటా సగటున 96,70,720 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,242.26 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 4,969.05 కోట్లు ఇచ్చింది. ఈ పథకం సొమ్మును మీరు ఎప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు?

జగనన్న విద్యా, వసతి దీవెన
ఈ పథకం కింద (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌), వసతి దీవెన పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున 27 లక్షల మంది విద్యార్థులకు రూ.18,663.44 కోట్లు అందజేసింది. విద్యార్థులకు మీరు ఈ సాయాన్ని ఎప్పుడు అందిస్తారు?

అమ్మ ఒడి పథకం
ఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున సగటున 42.62 లక్షల మంది తల్లులకు నాలుగేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.26,067.28 కోట్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ కింద కోటికి పైగా పిల్లలకు మీరు ఎప్పుడు ఈ సాయం అందిస్తారు? 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu government
Government of Andhra Pradesh
Unemployment benefit
unemployed youth
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.